twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హన్సిక ఈ కొత్త ట్విస్ట్ ఏంటి??

    By Srikanya
    |

    హైదరాబాద్ : కొద్ది రోజుల క్రితం వరకూ శింబు నేనూ ప్రేమించుకుంటున్నామని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని ట్విట్టర్ ల ద్వారా మీడియాకు తెలియచేసి సందడి చెసింది హన్సిక. అయితే ఇప్పుడు మాట మార్చి...నేనా ప్రేమా,పెళ్లా అంటూ దీర్ఘాలు తీస్తోంది. అంతేకాకుండా తనకింగా 22 ఏళ్ళేకనుక పెళ్లికి చాలా టైమ్ వుందని ప్రస్తుతం నటించడంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటున్నానని, స్వంత జీవితం గురించి ఆలోచించుకునే సమయం కూడా లేదని, వచ్చే ఐదేళ్ళలో తప్పకుండా పెళ్లిచేసుకుంటానని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది.

    అంతేగాకుండా నా మానాన నేను సినిమాలు చేసుకుంటూ వెళుతుంటే అనవసరంగా ప్రేమా అంటూ యాగీ చేస్తున్నారని, ప్రేక్షకుల కోసం కాస్త క్లోజ్ గా నటించినంత మాత్రాన ప్రేమలో మునిగితేలుతున్నామని అనుకోవడం తప్పని చెబుతోంది హన్సిక. ప్రస్తుతం తమిళంలో వెలిగిపోతున్న ఆమె కెరియర్ శింబుతో ప్రేమాయణం నడుపుతోందనగానే బ్రేక్‌పడింది.

    కోలీవుడ్‌లో రాజకుమార్తెగా గుర్తింపు పొందిన హన్సికకు అభిమానులు గుడి కూడా కట్టించి గౌరవించారు. అయితే శింబుతో ప్రేమాయణం నడుపుతోందని వార్తలు రాగానే మరో నయనతారగా గుర్తించి పట్టించుకోవటం మానేశారు. దాంతో ఇలా రివర్స్ లో మీడియాకు చెవిలో పూలు పెట్టడం మొదలెట్టింది. ఇంతకు ముందు 'అవును... మేం ప్రేమలో ఉన్నాం' అంటూ మొత్తానికి తన లవ్ ఎఫైర్ ని రివిల్ చేసేసిన హన్సిక ఇలా మాట్లాడటం చూసి షాక్ అవుతున్నారు.

    శింబు హీరోగా ప్రస్తుతం 'వాలు', 'వేట్త్టెమన్నన్‌' చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ రెండింటిలోనూ హన్సిక హీరోయిన్ గా నటిస్తోంది. 'వాలు' సినిమాలో నటిస్తున్నప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రేమపక్షుల్లా విహరిస్తూ డేటింగ్‌ చేస్తున్న వీరు త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు కూడా కొన్ని పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అయితే 'శింబును ప్రేమించట్లేద'ని హన్సిక తేల్చిచెప్పింది.

    English summary
    Hansika says that 'I Will Marry Only after 5 Years'. She condemns rumors of her love with Shimbu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X