కొత్తక వింత పాతొక రోత అన్న రీతిలో హన్సిక ఇప్పుడు తెలుగు సినిమా హాట్ ప్రోపర్టీ గా మారింది. 'దేశముదురు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆ అందం చాలా మందికి నిద్ర లేకుండా చేసింది.దాంతో మరేం చేసేది అంటూ నిర్మాతలు అంతా ఆమె వెనుక పడుతున్నారు.ఆమె మాత్రం కూల్ గా జూనియర్ యన్టీఆర్ సరసన కంత్రీ లో నటిస్తోంది.అందులో ఆమె చాలా గ్లామరస్ గా కనిపిస్తుందిట.దాంతో సినిమా విడుదల అయ్యాక పరిస్థితులు ఏ రకంగా మారతాయో నని నిర్మాతలు ఆమె చుట్టూ పరుగులు తీస్తున్నారట.దాంతో ఓ ప్రక్క సినిమా రిలీజ్ కు రెడీ అవుతూంటే మరోప్రక్క ఆమె ఆఫర్స్ తో ఉక్కిరి బిక్కిరి అవుతోందిట.కాని త్వరపడి ఏదీ కమిట్ అవ్వటం లేదట.బ్యానర్,దర్శకుడు,హీరో,రెమ్యునేషన్ చూస్తోందిట.యమ్.యస్.రాజు నిర్మాతగా బి.గోపాల్ దర్శకత్వంలో రామ్ హీరోగా నిర్మించ తలపెట్టిన ఓ క్రేజీ ప్రాజెక్టు లో మాత్రం ఆమె సరేనందిట.రాజు గారి బ్యానర్ లో చేసిన భూమిక,త్రిష,ఛార్మీ,ఇలియానా ఇప్పుడు పరిశ్రమను ఏలుతూండటంతో హన్సిక కూడా లక్కీ అంటున్నారు.