పవన్ 'పులి' కి బలవ్వకుండా తప్పించుకున్నానంటూ ఆమె

By Srikanya

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పులి భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఓ హీరోయిన్ హ్యాపీ గా ఉంది. ఆమె ఎవరంటే హన్సిక. ఆమెని మొదట ఈ పులికి హీరోయిన్ గా అడిగారు. అయితే వీరి అడిగిన డేట్స్, ఇస్తానన్న రెమ్యునేషన్ కి ఆమె సారి చెప్పి తప్పుకుంది. ఈ విషయం ప్రస్తావిస్తూ...హన్సిక...నేను కనుక ఆ చిత్రం ఒప్పుకుని ఉంటే...నా కెరీర్ లో రెండు సంవత్సరాలు వేస్ట్ అయ్యేవి. అలాగే నేను చాలా ఆఫర్స్ నష్టపోయేదాన్ని. అవన్నీ కాకపోయినా చివరకు ఓ డిజాస్టర్ నా కెరీర్ లో మిగిలేది. ఇక చాలా మంది నన్ను ఆ చిత్రంలో చేయమని ఒత్తిడి చేసారు. వారి మాటలు విననందుకు నాకిప్పుడు హ్యాపీగా ఉంది. ఇక పూరీ జగన్నాధ్ గోలీమార్ ని తాను ఒప్పుకోకపోవటం కూడా మంచిదే అయింది అంటోంది. ఇక ప్రస్తుతం ఈ దేశముదురు భామకి తెలుగులో సినిమాలు ఏమీలేవు. జయీభవ, సీతారాముల కళ్యాణం చూతుము రారండి తో ఆమెకు ఆఫర్స్ అన్నీ అడుగంటి...తమిళ చిత్ర పరిశ్రమకు తరిలివెళ్ళింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X