హన్సికకు వీరాభిమాని టార్చర్

అందులో ఆమెకు డబ్బు పిచ్చి కాబట్టి తనతో ఎడ్జెస్ట్ అవ్వచ్చునని పెళ్ళి చేసుకుందామని,తన దగ్గర చాలా ఆస్ధి ఉందని ప్రపోజల్స్ పెడుతున్నాడుట. మొదట ఏదో సరదాగా తన ఫ్లాప్ సినిమాలో పాత్రను గుర్తు చేస్తున్నాడుకుని అలాంటివి ఇక చేయను అని రెస్పాన్స్ ఇచ్చింది. ఇక ఇంకా రెచ్చిపోయిన అబిమాని ఫలానా రోజు ఫలానా ప్రాంతంలో నీ గురించి వెయిట్ చేస్తాను. కోటీశ్వరుడిని కరుణించు అంటూ మెయిల్స్ పంపుతున్నాడు.
దాంతో హన్సిక తన మెయిల్ ఇన్ భాక్స్ ని ఓపెన్ చెయ్యాలంటేనే భయపడుతోందిట.దాంతో ఆ మధ్య పోలీస్ కంప్లైంట్ ఇద్దామని నిర్ణయానికి వచ్చిందిట. అయితే అనవసరంగా అల్లరవుతుందని సీనియర్స్ హెచ్చరించి,మెయిల్ ఐడీ మారిస్తే సరిపోతుందని సలహా ఇచ్చారుట. ప్రస్తుతం హన్సిక నటించిన మస్కా సంక్రాంతికి రిలీజు అవ్వబోతోంది.ప్రభాస్ సరసన భిల్లా సినిమాలో ఓ పాత్రలను చేస్తోంది. కళ్యాణ్ రామ్ కొత్త సినిమాలోనూ ఆమె హీరోయిన్ గా బుక్కయిందని సమాచారం.


Click it and Unblock the Notifications











