Hansika Motwani: కాబోయే భర్తకు ఇదివరకే పెళ్లి.. అతని మొదటి పెళ్లికి కూడా వెళ్లిన హన్సిక?
బ్యూటీఫుల్ హీరోయిన్ హన్సిక మోత్వాని ఇటీవల పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆమె ఎప్పుడైతే పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసి కాబోయే భర్త గురించి చెప్పిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక అతను ఎవరని ఇంటర్నెట్ లో నెటిజన్లు సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే అతనికి ఇదివరకే పెళ్లి అయ్యిందని.. మొదటి పెళ్లికి హన్సిక కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

యాపిల్ బ్యూటీగా
హన్సిక మోత్వాని చైల్డ్ ఆర్టిస్ట్ గానే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. యాపిల్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న హన్సిక తెలుగులో అయితే దేశముదురు సినిమాతో తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఇక తర్వాత తమిళ్ కన్నడ మలయాళం ఇండస్ట్రీలో కూడా చాలా అవకాశాలు వచ్చాయి. అతి తక్కువ కాలంలోనే ఈ బ్యూటీకి పదుల సంఖ్యలో ఆఫర్లు వచ్చాయి.

అధికారికంగా పెళ్లి ప్రకటన
ఇక హన్సిక పెళ్లి గురించి గత రెండు మూడేళ్లుగా సోషల్ మీడియాలో అనే రకాలు కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఎక్కడా కూడా తన పెళ్లిపై పెద్దగా స్పందించలేదు కానీ ఇప్పుడు మాత్రం ఆమె అధికారికంగా తన పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలియజేసింది. ఇక ఆమె పెళ్లి చేసుకోబోయేది మరెవరినో కాదు తన తనకు సంబంధించిన పలు వ్యాపారాలాలో కూడా భాగస్వామి గా ఉన్నటువంటి సోహెల్ అనే బిజినెస్మేన్ తో హన్సిక ఏడడుగులు వేయనుంది.

వందల కోట్ల ఆస్తి
ఇక ఈ సోహెల్ అనే వ్యక్తి ఎవరు అనే విషయంలో కూడా అనేక రకాల రూమర్స్ అయితే వైరల్ గా మారాయి. ఇక హన్సిక సన్నిహితుల ప్రకారమైతే అతను బిజినెస్ పార్ట్నర్ అని చెప్పేసారు. ఇక అంతకు ముందు అయితే అతను ముంబైలో ఒక ప్రముఖ వ్యాపారవేత్త అని వందల కోట్లకు అధిపతి అని కూడా చాలా రకాల కథనాలు వెలుపడ్డాయి.

ఫొటోలు వైరల్ అయ్యేలా
ఇక ప్యారిస్ లో చాలా అందంగా తనకు కాబోయే భర్తకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసుకుని అతను ప్రపోజ్ చేస్తున్నట్లు కూడా ఆమె ఆ ఫోటోలో అర్థమయ్యేలా వివరణ ఇచ్చింది. ఇక తనతో ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది అని ఎల్లప్పుడూ కూడా తనతో జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటున్నట్లు కూడా హన్సిక సోహైల్ గురించి సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది.

అతనికి రెండవ పెళ్లి?
అయితే సోహెల్ అనే అతనికి ఇదివరకే పెళ్లి అయింది అని కూడా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అది కూడా హన్సికకు బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి అమ్మాయిని అతను మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని అయితే ఆ పెళ్లికి కూడా హన్సిక హాజరైనట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక సోహైల్ గత రెండేళ్ల క్రితం మొదటి భార్య నుంచి అతను విడాకులు తీసుకోవడంతో హన్సిక సోహైల్ తో డేటింగ్ స్టార్ట్ చేసింది. గత ఏడాది పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. మరి ఈ విషయంపై హన్సిక ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











