Hansika Motwani Divorce: భర్తతో హన్సిక విడాకులు నిజమే? ఆ నిర్ణయంతో డివోర్స్‌పై హింట్
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో వరుసపెట్టి విడాకులు, బ్రేకప్ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఎప్పుడు ఎవరు విడాకుల బాంబు పేలుస్తారోనని ఉత్కంఠ నెలకొంది. నిన్న మొన్నటి వరకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ విడాకుల వార్తలు నెట్టింట వైరల్ అవుతుండగా.. తాజాగా మరో స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ వైవాహిక జీవితంపైనా గత కొంతకాలంగా రూమర్స్ వస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ షాకిచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..
15 ఏళ్లకే హీరోయిన్‌గా
హాన్సిక మోత్వానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. 15 ఏళ్ల చిరు ప్రాయంలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. తన నవ్వుతోనే అభిమానుల మనసు గెలుచుకుంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసే అవకాశం దక్కించుకుని ఇండస్ట్రీని ఏలింది హన్సిక. ఈ క్రమంలో తమిళ చిత్ర పరిశ్రమలో ఆమెకు బ్రేక్ దక్కింది. బొద్దుగా, ముద్దుగా ఉండే హన్సిక తమిళ తంబిలను మాయ చేసింది. అక్కడా వరుస హిట్స్‌తో ఎదురు లేకుండా దూసుకెళ్లింది.

శింబుతో ప్రేమాయణం
కోలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో ఉన్నప్పుడు హీరో శింబుతో ప్రేమాయణం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. శింబుతో దాదాపు పెళ్లి వరకు వెళ్లిన హన్సిక అనూహ్యంగా అతనితో విడిపోయింది. ఆ తర్వాత విపరీతంగా లావు పెరిగిపోవడంతో హన్సికకు ఆఫర్లు తగ్గిపోయాయి. ఎంతో కష్టపడి తిరిగి అవకాశాల కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. తెలుగు, హిందీలలో సినిమాలు చేసినా గతంలో మాదిరిగా హిట్ కాలేదు. ఈ దశలో ఆమెను వరుస ఫ్లాపులు వెక్కిరించాయి.. ఏ సినిమా చేసినా పెద్దగా క్లిక్ కాకపోవడంతో టీవీ షోలకు జడ్జిగా సందడి చేసింది హీరోయిన్.
సొహైల్‌తో పెళ్లి
ఈ దశలో తన చిన్ననాటి మిత్రుడు సొహైల్‌తో ప్రేమలో పడింది హన్సిక మోత్వానీ. అయితే అప్పటికే సొహైల్‌కు రింకీ బజాజ్ అనే యువతిని పెళ్లాడారు. ఈ పెళ్లికి స్వయంగా హన్సిక కూడా వెళ్లింది. కానీ సొహైల్- రింకీలు కొంతకాలానికే విడిపోయారు. ఈ దశలో ఆయనకు బాగా దగ్గరైన హన్సిక కొన్నేళ్లు డేటింగ్ చేసింది. ఓ రోజున తాను సొహైల్‌ను పెళ్లాడుతున్నట్లు సంచలన ప్రకటన చేసి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. పెళ్లి తర్వాత సొహైల్‌తో అన్యోన్యంగా ఉన్న హన్సిక.. సోషల్ మీడియాలో భర్తతో సందడి చేసింది. తమ పెళ్లి విశేషాలను తెలియజేస్తూ లవ్ షాదీ డ్రామా పేరుతో ఓటీటీ సిరీస్‌ను విడుదల చేసింది.
ఆ ఫోటోలు తొలగించిన హన్సిక
అయితే ప్రస్తుతం సొహైల్‌తో హన్సిక సంబంధాలు దెబ్బతిన్నాయని.. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని చిత్ర పరిశ్రమలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితమే సొహైల్‌కు దూరంగా తల్లి దగ్గరికి వచ్చేసింది హన్సిక. సోషల్ మీడియాలో తల్లితో కలిసి వీడియోలు చేస్తూ వచ్చింది. అప్పుడే హన్సిక వైవాహిక జీవితంపై అనేక అనుమానాలు వచ్చాయి. దీంతో హన్సిక విడాకులు తీసుకోబోతుందని బాలీవుడ్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే ఆమె భర్త సొహైల్ మాత్రం వీటిని కొట్టిపారేశాడు. తాజాగా హన్సిక చేసిన పనితో ఈ ఊహాగానాలకు బలం చేకూరినట్లయ్యింది. తన పెళ్లి, సొహైల్‌తో కలిసున్న ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి హన్సిక మోత్వానీ డిలీట్ చేశారు. దీంతో సొహైల్ - హన్సికల విడాకులు అధికారికంగా కన్ఫర్మ్ అయినట్లేనని .. ఈ విషయంపై హన్సిక హింట్ ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











