For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మంచు మనోజ్ కి హ్యాండ్ ఇచ్చిన హన్సిక

  By Srikanya
  |

  హైదరాబాద్ : హన్సిక గత కొంతకాలంగా మంచు కాంపౌండ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. హన్సిక తో మంచు హీరో విష్ణు కాంబినేషన్ లో దేనికైనా రెడీ,పాండవులు పాండవులు చిత్రాలు వచ్చి మంచి విజయం సాధించాయి. దాంతో ఆమెను మరోసారి తమ హీరోకి ఎంపిక చేసారు. అయితే ఇప్పుడు హీరో మంచు మనోజ్. అంతా సెట్ అయ్యింది,తమకు అచ్చి వచ్చిన హీరోయిన్ అని ముచ్చటపడేలోపల ఆమె హ్యాండ్ ఇచ్చిందని సమాచారం. తనకు డేట్స్ ప్లాబ్లం ఉందని చెప్పి ప్రాజెక్టు నుంచి తప్పుకుందని తెలుస్తోంది. దాంతో రాకుల్ ప్రీతి సింగ్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. రాకుల్ ప్రీతి సింగ్ గతంలో సందీప్ కిషన్ సరసన వెంకటాద్రి ఎక్సప్రెస్ చిత్రం చేసింది.

  దర్శకుడు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ... "మొదట మేము హన్సిక ను ఈ పాత్రకు తీసుకున్నాం. మనోజ్ తో ఆమె కెమిస్ట్రీ బావుంటుందని భావించాం. కానీ ఆమె బిజీ షెడ్యూల్ వల్ల డేట్స్ ఇవ్వటం కుదరలేదు. దాంతో మేము రాకుల్ ప్రీతి సింగ్ తో ముందుకు వెళ్తున్నాం. ఇది మనోజ్,నేను తీసుకున్న ఇనానమస్ డెసిషన్ ," అన్నారు.

  యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా సినిమా రూపొందిచే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో మంచు మనోజ్ కొత్త గెటప్ లో కనిపిస్తాడు. ఈ సినిమా తమ స్వంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్నా పిక్చర్స్ నిర్మిస్త్తోంది. పాండవులు పాండవులు సినిమాలో తన నాన్న అన్నతో కలిసి సొంత బేనర్ లో నటించిన మంచి మనోజ్ మరో రెండు సినిమాలు చేయబోతున్నాడు.

  మంచు మనోజ్ మాట్లాడుతూ... ఈ సినిమాలో నా గెటప్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇది యాక్షన్ కలగలిపిన చిత్రం. దీని తరువాత సాగర్ దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మాతగా సన్నాఫ్ పెదరాయుడు సినిమా కూడా చేయబోతున్నాను. ఇది కాకుండా మరో సినిమా చర్చల దశలో ఉంది. మళ్ళీ మల్టీస్టారర్ సినిమా అన్నీ కుదిరితే తప్పకుండా చేస్తాను అన్నారు.

  ఇటీవల హన్సికకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయట. దర్శకులు కొత్త కథలు వినిపిస్తామంటూ వెంటపడుతున్నారట. వరస ఆఫర్స్ తో ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇన్నాళ్ళూ బొద్దు పాపలాగ ఉందని ప్రక్కన పెట్టినవాళ్లంతా ఆమె సన్నబడటంతో సై అంటూ ముందుకు దూకుతున్నారు. పట్టుబట్టి మరీ బరువు తగ్గి తన అందాలకు పదును పెట్టిన హన్సిక మళ్లీ పీక్‌టైమ్‌లోకి చేరిందని అంటున్నారు సినీ జనం.

  'దేశముదురు'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఆ తరువాత కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టడంతో కెరీర్ కోల్పోయింది. ఆ తరువాత తమిళానికి వెళ్లి గుడి కట్టించుకునే స్థాయికి వెళ్లింది. తాజాగా తెలుగులో నితిన్‌తో ఓ చిత్రం చేస్తోందట. కరుణాకరన్ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది. ఇదే సమయంలో తమిళంలోనూ నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది.

  English summary
  Hansika Motwani was set to act with actor Manchu Manoj in upcoming yet-untitled Telugu film. But due to her busy work schedule, she has been replaced by Rakul Preet Singh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X