అల్లు అర్జున్ తో చేయటం లేదు
గమ్యంతో నంది అవార్డుని,ప్రేక్షకుల రివార్డుని గెలుచుకున్న క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రం వేదం. ఈ చిత్రంలో హన్సిక అల్లు అర్జున్ సరసన చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమె చేయటం లేదని తెలుస్తోంది. ఎందుకంటే వేదం లో తన పాత్ర చిన్నది కావడం, రెమ్యునేషన్ కూడా తక్కువే కావడంతో, హన్సిక ఈ సినిమాలో నటించేందుకు నిరాకరించిందని సమాచారం. ఇక జయీభవ చిత్రంలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో నితిన్ హీరోగా రూపొందుతున్న 'సీతారాముల కళ్యాణం'చేస్తోంది. ఇక అల్లు అర్జున్, హన్సిక కాంబినేషన్లో గతంలో దేశముదురు చిత్రం పెద్ద హిట్ కావటంతో ఈ కాంబినేషన్ అనగానే మంచి క్రేజ్ వచ్చింది. అలాగే ఈ చిత్రంలో మనోజ్, అనూష్క మరో ముఖ్య పాత్రల్లో చేస్తున్నారు. అనూష్క చేస్తున్న వేశ్య పాత్రకు అవార్డు వస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.
హన్సిక అల్లు అర్జున్ దేశముదురు క్రిష్ వేదం గమ్యం సీతారామ కళ్యాణం నితిన్ రెచ్చిపో అనూష్క మనోజ్ అరుంధతి vedam krish manoj gamyam anushka allu arjun desamuduru


Click it and Unblock the Notifications