స్టార్ హీరోకి ట్రైల్స్ వేస్తున్న హన్సిక
హాట్ స్టార్ గా తెలుగులో వెలుగుతున్న హన్సిక వరస పెట్టి అందరి హీరోలతో చేస్తోంది. అయితే ఆమెకు ఓ స్టార్ హీరోతో సరసన చెయ్యాలని ఎప్పుడునుంచో కోరక ఉందిట. ఈ విషయాన్ని ఆమె మీడియా ముందు వెల్లబుచ్చింది. "కమల్ నటనంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన నటించిన సినిమాలను అడపాదడపా చూశాను. ఆయనతో కలిసి నటించాలని కోరికగా ఉంది" అని చెప్పుకొచ్చింది హన్సిక. అయితే విన్న కొంతమంది మాత్రం హన్సిక కన్ను తమిళ పరిశ్రమ పై పడింది..అందుకే ఈ తరహా స్టేట్ మెంట్స్ ఇంస్తోందంటున్నారు. ఓ ప్రక్క ఆమె పోటీదార్లు త్రిష..శింబుతో చేస్తోంది. అనూష్క తాజాగా విజయ్ తో చేసింది. ఇక ఇలియానా అయితే ఏకంగా విక్రమ్ సరసన బుక్కయింది. ఇవ్వన్నీ చూసిన ఆమె ఏకంగా సీనియర్ హీరో కమల్ కే ట్రాక్ వేసి అక్కడ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉందంటున్నారు. అందులోనూ దేశముదురు తర్వాత ఈ భామకు చెప్పుకోతగ్గ హిట్స్ కూడా లేవు. కళ్యాణ్ రామ్ సరసన జయీభవ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అదీ ఫెయిలయింది. భిళ్ళాలో ఐటం సాంగ్ కలసి రాలేదు. తాజాగా వరస ఫ్లాఫుల వీరుడు నితిన్ సరసన చేస్తోంది. 'సీతారాముల కల్యాణం' టైటిల్ తో రిలీజ్ కానున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఇక కమల్ ఈమె మెర విని కోలీవుడ్ కి పిలిస్తే హ్యాపీనే.


Click it and Unblock the Notifications











