Balayya: ప్రశాంత్ వర్మ - బాలయ్య కాంబో ఫిక్స్... ఆ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్.. ఇక బాక్సులు బద్దలే!
అ!, జాంబిరెడ్డి సినిమాలతో హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ... తాజాగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ అయి.. సూపర్ హిట్టుగా దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ ఏ హీరోతో సినిమా చేస్తాడు అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ నెక్ట్స్ మూవీ అప్డేట్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే....
హనుమాన్ సినిమాతో తన సత్తా ఏంటో పాన్ ఇండియా వైడ్ గా నిరూపించుకున్నాడు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సూపర్ హీరో చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇక అమృత అయ్యర్ హీరోయిన్ గా విలన్ రాయ్ విలన్ గా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు ఈ సినిమాల్లో కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాని నిరంజన్ రెడ్డి 60 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు.

ఇక ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన సూపర్ హీరోల సిినిమాలు 12 తీయనున్నాడు. ఇక అవి పక్కన పెడితే... బాలయ్యతో ఓ సినిమా చేయనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తుందా లేదా అనేది తెలియదు కానీ... ఇంకో మూవీకి సీక్వెల్ గా రాబోతుందని తెలుస్తోంది.
బాలయ్య ఎప్పటి నుంచో ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999 సినిమాని తెరకక్కించాలని అనుకుంటున్నాడు. అయితే ఈ సినిమాకి మొదట సంగీత శ్రీనివాసరావు ని దర్శకుడిగా అనుకున్నారు. కానీ ఆయనకు వయసు కూడా అయిపోయింది.. ఇప్పుడు ఆయన సినిమా తీసే సిచ్యూవేషన్ లేదు. ఇక ఈ సినిమాకు బాలయ్యే డైరెక్టర్ గా మారి తీద్దామని ఆలోచనలో కూడా కొద్దిరోజులు అనుకున్నాడు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో డైరెక్టర్, హీరో అంటే కష్టమే. మొదటి సారిగా బాలయ్య డైరెక్టర్ గా మారి.. ఒక వేళ ఆ సినిమా అటు ఇటు అయితే ఇబ్బంది పడాల్సి వస్తుందని.. ఆ రిస్క్ తీసుకునే స్థితిలో లేనట్లు ఉంది. అయితే ఈ సినిమా సీక్వెల్ బాధ్యతలను హనుమాన్ దర్శకుడుకు ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. హనుమాన్ సినిమాతో తన సత్తా ఏంటో చూపించిన ఈ డైరెక్టర్ అయితేనే ఈ సీక్వెల్ కు కరెక్ట్ అని భావిస్తున్నారట.
బాలయ్య ప్రశాంత్ వర్మతో సినిమా చేయడానికి ఎప్పుడో అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు బాలయ్య ఆదిత్య 999 సినిమాని ప్రశాంత్ వర్మతో తీయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ... ప్రశాంత్ వర్మ మాత్రం ఆదిత్య 999 సినిమాని అప్పగిస్తే చాలా బాగా హ్యాండిల్ చేయగలడని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











