Hanuman Movie Update: సూపర్‌ హీరో మూవీ 'హనుమాన్' వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆదిపురుష్ సినిమాతో పాటుగా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల అందరి అటెన్షన్ గ్రాప్ చేసిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిజానికి గతంలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో సినిమా వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించిన అధికారికి ప్రకటన ఇచ్చే అవకాశం కల్పిస్తోందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

ఆ సినిమాతో మొదలు...
'ఆ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన కల్కి వంటి సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కలెక్షన్స్ పరంగా ఆ సినిమా పెద్దగా మెప్పించకపోయినా కంటెంట్ పరంగా మాత్రం అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత కరోనా సమయంలో చేసిన జాంబిరెడ్డి సినిమా కూడా ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాల తర్వాత ఆయన ఏకంగా ఒక ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Hanuman Movie Update

సూపర్ హీరో కథతో హనుమాన్
ఇప్పటికే మనం హాలీవుడ్ నుంచి అనేకమంది సూపర్ హీరోలను చూసాం.. కానీ ప్రతి తెలుగువాడు మాత్రమే కాదు భారతీయుడు కూడా చిన్నప్పటి నుంచి సూపర్ హీరోగా భావిస్తూ వచ్చే హనుమంతుడి మీద ఒక సినిమా చేయాలని భావించి దాన్ని హాలీవుడ్ లెవెల్ లో ఎగ్జిక్యూట్ చేయాలని భావించిన ప్రశాంత్ వర్మ... తానే సొంతంగా కథ రాసుకుని ఈ హనుమాన్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి ఈ కథ నచ్చడంతో ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చాడు.

Hanuman Movie Update

హనుమాన్ వచ్చేది ఆరోజునే...
తేజ సబ్జా హీరోగా అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాని ఇప్పటికే విడుదల చేయాల్సి ఉంది. కానీ పలు కారణాలతో వాయిదా వేశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ తాజాగా ఫిక్స్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాని ఆగస్టు 25వ తేదీ శుక్రవారం రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఇప్పటికే థియేటర్లు దక్కించుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది.

Hanuman Movie Update
అధికారిక ప్రకటన అప్పుడే...
థియేటర్లు దక్కించుకుంటే కనుక కచ్చితంగా అదే రోజున రిలీజ్ చేస్తారని ఈ మేరకు జూలై నెల మొదటి వారంలో అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆదిపురుష్ సినిమా తిరుపతి ప్రీ రిలీజ్ ఈవెంట్ బాధ్యతలు తన భుజాల మీద వేసుకుని నడిపించాడు ప్రశాంత్ వర్మ. అప్పుడే హనుమాన్ సినిమా గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో హనుమాన్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు.
Hanuman Movie Update

పాన్ ఇండియా లెవెల్ లో రీలిజ్..
ఈ హనుమాన్ సినిమాని కూడా తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హిందీలో పెన్ సంస్థ ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ స్టాఫ్ సినిమా మీద ఆసక్తి పెంచేయగా.. సినిమా ఎలా ఉండబోతోంది అని అందరూ ఎదురుచూస్తున్నారు. మరి చూడాలి సినిమా ఎప్పుడు అధికారికంగా రిలీజ్ చేస్తారు అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X