కొద్ది రోజులుగా ప్రియమణి చాలా హ్యాపీగా కనపడుతోంది.కారణం కల్యాణరామ్ అని చెబుతోందిట.త్వరలో రిలీజుకు రెడీ అవుతున్న 'హరేరామ్' లో ఆమెది కథను మలుపుతిప్పి కలకాలం గుర్తుంచుకోబోయే పాత్రట.కామిడీతో సాగి పోయే ఈ పాత్రను కల్యాణరామ్ అర్ధమయ్యేలా వివరించి ఆమె పాత్రలో లీనమయ్యేలా చేసాడుట.దాంతో ఆ పాత్ర నటిగా తనకు మంచి గుర్తింపు సాధించిపెడుతుందని ఉషారుగా అందరితో చెప్తోందిట.పనిలో పనిగా సొంత ప్రొడక్షన్ లో ఆఫర్ ఇచ్చిన కల్యాణరామ్ కు థ్యాంక్స్ చెబుతోంది.అంతే కాకుండా ఇలాంటి కామెడీ రోల్ కోసం తాను చాలా రోజులుగా ఎదురుచూస్తున్నట్టు చెప్తోంది.దాంతో చేతిలో పూర్తి స్ధాయిలో సినిమాలు లేనప్పుడే ఇలాంటి బడాయి కబుర్లు వస్తాయిని తోటి హీరోయిన్లు నవ్వుకుంటున్నారట.అందులోనూ 'పెళ్లైన కొత్తలో...', 'యమదొంగ', 'నవవసంతం' వంటి హిట్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనా పెద్దగా అవకాశాలు రాకపోవటంతో ఈ కామెంట్లకు ఊతమిచ్చినట్లవుతోంది.