ఆ నటితో హార్డిక్ పాండ్యా తెగతెంపులు? కొత్త గర్ల్ ఫ్రెండ్‌తో ముణ్నాళ్ల ముచ్చటే

ఇండియాలో క్రికెటర్లు, సినీనటుల మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో క్రికెటర్లు, హీరోయిన్ల మధ్య ఎఫైర్లు, పెళ్లి వరకు వెళ్లింది. కానీ వీటిలో ఎక్కువ బ్రేకప్స్‌ జరిగాయి. తాజాగా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్‌ హార్డిక్ పాండ్యా మరోసారి బ్రేకప్ వార్తల్లో నిలిచారు. గతేడాది నటాషాతో విడాకులతో సంచలనం కలిగించిన హార్డిక్ మరోసారి కలకలం రేపారు. ఈ వివరాల్లోకి వెళితే..

పలువురు హీరోయిన్లతో హార్డిక్ డేటింగ్
హార్డిక్ పాండ్యాకు చాలా మంది హీరోయిన్లతో డేటింగ్ చేశారు. లిషా శర్మ, ఇల్లి అవ్వరం, పరిణితి చోప్రా, ఊర్వశి రౌటేలా, ఈషా గుప్తా, నటాషా స్టాంకోవిక్‌లతో ఆయన ప్రేమాయణం నడిపించారు. నటాషాతో సుదీర్ఘకాలం డేటింగ్ చేశాడు. 2020లో వివాహం కాగా.. ఈ దంపతులకు అగస్త్య అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. సెర్బియాకు చెందిన నటాషా.. మోడలింగ్, సినిమాలలో నటించేవారు. ఈ క్రమంలో హార్డిక్‌తో పరిచయం, ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు.

Hardik Pandya And Jasmin Walia Unfollow Each Other On Instagram Spark Breakup rumours

నటాషాతో విడాకులు
నటాషాతో విడాకుల తర్వాత హార్డిక్ తన ప్రేమాయణాలను తిరిగి కొనసాగించారని అంటారు. బాలీవుడ్ నటి ఈషా గుప్తాతోనూ ఆయన డేటింగ్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే తాము రిలేషన్‌లోకి వెళ్లేలోగా తమ దారులు వేరయ్యాయని ఈషా గుప్తా పేర్కొన్నారు. రెండు, మూడు సార్లు కలిశామని అలా కొద్దినెలల పాటు మా రిలేషన్ సాగిందని, తర్వాత దానికి ఎండ్ కార్డ్ పడిందని ఈమె వెల్లడించారు. అయితే హార్డిక్ ఓ కొత్త గర్ల్ ఫ్రెండ్‌తో తిరుగుతున్నట్లుగా మొన్నామధ్య వార్తలు వచ్చాయి.

కొత్త గర్ల్ ఫ్రెండ్‌తో చక్కర్లు
దుబాయ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో హార్డిక్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ సందడి చేసినట్లు ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆమె పేరు జాస్మిన్ వాలియా. భారత సంతతికి చెందిన బ్రిటీష్ సింగర్, టెలివిజన్ నటి. బ్రిటీష్ రియాలిటీ షో ద ఓన్లీ వే ఈజ్ ఎస్‌ఎక్స్‌ షోతో ఆమె పాపులర్ అయ్యారు. బ్రిటన్‌తో పాటు భారత్‌లోనూ జాస్మిన్‌కు ఫాలోయింగ్ ఉంది. జాక్ నైట్‌తో 2017లో చేసిన బామ్ డిగ్గి సాంగ్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. బిగ్‌బాస్ 13 ఫైనలిస్ట్ అసిమ్ రియాతో కలిసి జాస్మిన్ పలు మ్యూజిక్ వీడియోలు చేశారు.

ఆ పోస్ట్‌తో బ్రేకప్ రూమర్స్
గతేడాది హార్డిక్ పాండ్యా, జాస్మిన్‌లు‌ ఒకే లోకేషన్‌ నుంచి ఫోటోలను షేర్ చేయడంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందన్న వార్తలు హల్‌చల్ ‌చేశాయి. అప్పటి నుంచి హార్డిక్, జాస్మిన్‌లు ఎక్కడో ఒక చోట పబ్లిక్‌గా కనిపిస్తూ మీడియాకు పని పెట్టేవారు. అలాగే ముంబై ఇండియన్స్ జట్టు బస్సులోనూ జాస్మిన్ కనిపించడంతో వీరిద్దరి బంధంపై అంతా ఫిక్స్ అయిపోయారు. తాజాగా వీరిద్దరి రిలేషన్ ముగిసిపోయినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. హార్డిక్ పాండ్యా, జాస్మిన్ వాలియా ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకున్నట్లుగా ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. ఒకరి ఖాతాలను మరొకరు అన్‌ఫాలో చేసుకున్నప్పటికీ హార్డిక్- జాస్మిన్ ఇద్దరూ తాము విడిపోయినట్లుగా ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ వీరి బ్రేకప్‌పై మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: hardik pandya jasmin walia
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X