హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి? వాళ్ల కండీషన్‌తో ఆ నటిని పెళ్లాడనున్న క్రికెటర్?

ప్రస్తుతం భారతదేశాన్ని ఐపీఎల్ ఫీవర్ ఊపేస్తోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ఆస్వాదిస్తున్నారు. గ్రూప్ దశకు ఎండ్ కార్డ్ పడి.. త్వరలోనే ప్లే ఆఫ్స్ మొదలుకానున్నాయి. దాంతో వచ్చే రెండు వారాలు భారతీయ క్రికెట్ అభిమానులకు పండగే. ఈ దశలో స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా పెళ్లి వార్త ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..

హార్దిక్ పాండ్యా తొలుత నటాషాతో డేటింగ్ చేసి ఆపై వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు. అయితే అనూహ్య పరిణామాల మధ్య హార్దిక్ - నటాషాలు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పలువురు ముద్దుగుమ్మలతో హార్డిక్ డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే గత కొన్నాళ్లుగా మహీకా శర్మ అనే నటి, మోడల్‌తో హార్దిక్ పీకల్లోతు ప్రేమాయాణం సాగిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన టీ20 ప్రపంచకప్ వేడుకల్లో, ఇటీవల ముంబై ఇండియన్స్ బస్సులో హార్దిక్‌తో కలిసి మహీకా ప్రయాణించడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది.

Hardik Pandya To Marry Mahieka Sharma Wedding Rumours Shake Cricket World

మహీకాతో అయినా పెళ్లి దాకా వెళ్తాడా లేక ఇది కూడా డేటింగ్ వరకే పరిమితమా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే మహీకాను మాత్రం పెళ్లి చేసుకునే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. దీనికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) నిర్ణయమే కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల ఆటగాళ్ల భద్రత, వారి ఏకాగ్రతను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. జట్టు పలు ప్రాంతాల్లో పర్యటించే సమయంలో క్రికెటర్ల వెంట వారి స్నేహితురాళ్లు, ప్రియురాళ్లకు అనుమతి ఉండదు. కేవలం భార్యాపిల్లలకు మాత్రమే అనుమతి లభిస్తుంది.

అయితే మహీకాతో పీకల్లోతు ప్రేమాయణం సాగిస్తున్న హార్దికా పాండ్యా.. ఆమెను క్షణం కూడా విడిచి ఉండలేకపోతున్నాడట. బీసీసీఐ కొత్త నిబంధన కారణంగా ఆమెను ఎక్కడ వదిలి ఉండాల్సి వస్తుందోనని మహీకాను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. పెళ్లి చేసుకుంటే ఆమె తన వెంట ఉండటానికి ఎలాంటి అవరోధాలు ఉండవని పాండ్యా భావిస్తున్నాడట. ఈ నెల 22న మహీకా శర్మ- హార్దిక్ పాండ్యాల పెళ్లి జరగనుందని సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అవుతున్నాయి.

కానీ ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని హార్దిక్ పాండ్యా అభిమానులు కొట్టిపారేస్తున్నారు. పాండ్యా ప్రస్తుతం తన ఫోకస్ ఆటపైనే పెట్టారని.. ముంబై ఇండియన్స్‌ను విజయపథంలో నడిపించడమే లక్ష్యమని అంటున్నారు. హార్దిక్, మహీకా కుటుంబ సభ్యులు అధికారికంగా ఈ విషయంపై స్పందించే వరకు పెళ్లి వార్తలను నమ్మొద్దని కోరుతున్నారు. మరోవైపు.. ఐపీఎల్ 2026లో హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమవుతున్నాడు. ఆటగాడిగానే కాకుండా, కెప్టెన్‌గానూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్.. తాజా సీజన్‌లో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై జట్టు.. 4 విజయాలు, 8 ఓటములతో చెత్త ప్రదర్శన చేసింది. వెన్నునొప్పి కారణంగా పాండ్యా.. ముంబై ఆడిన చివరి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రాలు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇప్పటికే గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న హార్దిక్ పాండ్యా.. ఈ పెళ్లి వార్తలతో మరోసారి ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. మరి మహీకాతో నిజంగానే ఆయన ఏడడుగులు వేస్తారా? లేదా అన్నదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more about: hardik pandya Mahieka Sharma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X