Hari Hara Veera Mallu సినిమాపై షాకింగ్ న్యూస్.. అదే. నిజమైతే ఫ్యాన్స్ కు నిరాశే!

టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు అనగానే అభిమానులో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అందులోనూ చారిత్రాత్మక నేపథ్యంలో హరిహర వీరమల్లు అనే సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొదటిసారి పవన్ కళ్యాణ్ ను ఒక హిస్టారికల్ సినిమాలో కనిపిస్తున్నాడు అనగానే అందరి ఫోకస్ కూడా ఇదే సినిమాపై ఎక్కువగా పడింది.

అయితే ఎనౌన్స్ మెంట్ వచ్చిన తర్వాత సినిమా హైప్ పెరిగే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు సరైన ప్రమోషన్స్ కూడా చేయడం లేదు అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక మధ్యలో సినిమా ఆగిపోయినట్లు కూడా ఎన్నో రకాల వార్తలొచ్చాయి. సినిమా అవుట్ పుట్ కూడా సరిగ్గా రావడం లేదు అని మరికొన్ని గాసిప్స్ కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల చిత్ర నిర్మాత ఏఎమ్.రత్నం ఒక ఈవెంట్లో సినిమా తప్పకుండా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అన్నారు.

hari hara veera mallu music director MM Keeravani walked out

అయితే ఆ విషయం చెప్పగానే అభిమానులు ఒక విధంగా హ్యాపీగా ఫీల్ అయినప్పటికీ ప్రస్తుతం మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నుంచి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తప్పకున్నట్లు టాక్ వినిపిస్తోంది. RRR సినిమా ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు అందుకున్న కీరవాణి ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇస్తాడు అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఇతర కారణాల వలన ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయినట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఇదే నిజమైతే మాత్రం సినిమాపై కొంత హైప్ తగ్గే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరపైకి తీసుకురాబోతున్నారు. కీరవాణి ఇదివరకే బాహుబలి RRR సినిమాలతో ఇతర ఇండస్ట్రీలలో కూడా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ హరి హర వీరమల్లు సినిమాకు మ్యూజిక్ ఇస్తే ఇతర భాషల్లో కూడా మంచి హైప్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X