Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
హరిహర వీరమల్లులో చారిత్రాత్మక వజ్రం.. దానికోసం భారీగా ఖర్చు చేస్తున్న నిర్మాత!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎఏం రత్నం ప్రొడక్షన్లో రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే రూపొందుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల ఆసక్తికరమైన విషయాలను వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక ఈ సినిమాలోని ప్రధాన అంశం ఒక చారిత్రాత్మక డైమండ్ గురించే అని అందుకోసమే నిర్మాత భారీగా ఖర్చు చేస్తున్నట్లు కూడా ఒక టాక్ వినిపిస్తోంది ఆ వివరాల్లోకి వెళితే..

పవన్ కెరీర్ లో ఫస్ట్ టైమ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక చారిత్రాత్మక నేపథ్యం కలిగిన కథలో హీరోగా కనిపించబోతున్నాడు. సంపన్నుల నుంచి దోచుకుని పేద వారికి దానం చేసే రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ లో హైలెట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పాటు ఒక టీజర్ కూడా అంచనాలు పెంచిన విషయం తెలిసిందే.

రిలీజ్ ఎప్పుడో..
దర్శకుడు అయితే ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నాడు. కానీ అనుకోకుండా షూటింగ్ వాయిదా పడుతూ ఉండడం వలన విడుదల విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేసి ఇదే ఏడాది దసరా సమయానికి విడుదల చేయాలని అనుకుంటున్నారు.

చారిత్రాత్మక నేపథ్యంలో
అయితే హరిహర వీరమల్లు సినిమాలో ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే కంటెంట్ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ముఖ్యంగా మొగల్ సామ్రాజ్యానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను కూడా హైలెట్ చేయబోతున్నారట. 16వ శతాబ్దంలోని అనేక రకాల విషయాలను కూడా దర్శకుడు చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

మరో కీలక షెడ్యూల్
ఇదివరకే గండికోట చార్మినార్ సంబంధించిన కొన్ని సన్నివేశాలను పూర్తి చేశారు. ఇక ప్రస్తుతం హైదరాబాదులోని మరొక అద్భుతమైన సెట్లో రెండు వారాలపాటు షూటింగ్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ షెడ్యూల్లో బాలీవుడ్ నటుడు బాబి డియోల్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే ఎనిమిది రోజులపాటు ఈ షెడ్యూల్లో బిజీగా కనిపించబోతున్నాడు.

కోహినూర్ వజ్రం
అయితే సినిమాలో కోహినూర్ వజ్రానికి సంబంధించిన అంశాలు చాలా హైలెట్ అవుతాయని తెలుస్తోంది. కోహినూర్ ను మొగల్ సామ్రాజ్యం నుంచి హీరో ఎలా దొంగతనం చేశాడు అనే కాన్సెప్ట్ తో అసలు కథ ఉండబోతుందట. సినిమాలో పవన్ కళ్యాణ్ చేసే పోరాట విన్యాసాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అని తెలుస్తోంది.

ఖరీదైన వజ్రం కోసం..
అయితే కోహినూర్ వజ్రంను చూపించాలి కాబట్టి ఏదో సాధారణ మైన వజ్రాన్ని చూపించకుండా ఎక్కువ ఖరీదైన వజ్రాన్ని సినిమాలో కూడా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కోహినూర్ వజ్రం తరహాలో ఉండే 30 లక్షల విలువచేసే డైమండ్లు కూడా చిత్ర యూనిట్ సభ్యులు రెడీ చేయించినట్లు సమాచారం. అయితే వజ్రాన్ని కొనుగోలు చేసిన తర్వాత అమ్మేటప్పుడు మాత్రం కొన్నదర కంటే తక్కువ కూడా కావచ్చు మరి ఈ డైమండ్ కు సంబంధించిన సన్నివేశాలు సినిమాలో ఎలా ఉంటాయో చూడాలి.