పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నది మాములు గన్ కాదు.. హిస్టరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే వెండితెరపై అలరించే సమయం రానుంది. పొలిటికల్ గా ప్రభంజనం సృష్టించిన తర్వాత పవన్ కళ్యాణ్ తొలిసారిగా వెండితెరపై ఎప్పుడు కనిపిస్తారని అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే నెక్స్ట్ హరి హర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ బ్యాక్ టు బ్యాక్ అందుతున్నాయి. కాగా తాజాగా ఈ చిత్రంలోని లేటెస్ట్ పోస్టర్ ఒకటి వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
18వ శతాబ్దంలో వీరమల్లు..
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో వీరమల్లుగా కనిపించబోతున్నారు. 18వ శతాబ్దంలో ఈ సినిమా కథ సెట్ చేయబడింది. వీరమల్లుగా పవన్ కళ్యాణ్ మొగలుల సామ్రాజ్యంపై యుద్ధం చేయబోతున్నారు. కోహినూర్ డైమండ్ ను వారి నుంచి తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నమే ఈ సినిమా కథగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రం లో భారీ యుద్ధ సన్నివేశాలు, కత్తి యుద్ధాలు ఉండనున్నాయి. పవన్ కళ్యాణ్ అందుకోసం సపరేట్గా శిక్షణ కూడా పొంది యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా నటించారు. ఇక వెండి తెరపై పవనుడిని చూడడమే ఆలస్యం.

హరిహర వీరమల్లు కోసం ప్రత్యేక ఆయుధాలు..
పీరియాడి క్ చిత్రాలను రూపొందించే సమయంలో దర్శక నిర్మాతలు ఆయా కాలాలకు అనుగుణంగా, కథకు అనుగుణంగా భారీ సెట్స్ ను నిర్మిస్తారు. అదే సమయంలో కథకు కావలసిన ప్రత్యేక ఆయుధాలను కూడా తయారు చేయిస్తారు. ఇక హరి హర వీరమల్లు సినిమా కోసం మ్యాచ్ లాక్ అనే పొడవాటి గన్నును తయారు చేయించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఆ గన్ను పట్టుకున్న పోస్టులను విడుదల చేశారు. ఆ గన్ ఎంటా అని ఆసక్తి మొదలైంది. దానితో పాటు మరిన్ని ప్రత్యేక ఆయుధాలను కూడా తయారు చేయించారని తెలుస్తుంది.
మొఘల్ ఆర్మీ ఆఫీసర్గా..
పవన్ కళ్యాణ్ చేతిలో పట్టుకున్న ఆ పొడవాటి మ్యాచ్ లాక్ గన్ ను చూస్తుంటే పవన్ మొఘల్ సామ్రాజ్యంలో ఆర్మీ ఆఫీసర్ గా విధులు నిర్వహించే సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఆ గన్ ను మొఘల్ ఆర్మీ ఆఫీసర్లు 16 నుంచి 18వ శతాబ్దంలో ఉపయోగించారని తెలుస్తోంది. ఇక ఈ గన్ ఇండియాలోనే ఉపయోగించిన మొట్టమొదటి ఆయుధంగా చరిత్రలోకి ఎక్కింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా గన్స్ ను బాగానే హ్యాండిల్ చేస్తారు. ఆయన చెన్నై లైఫ్ ఇన్ క్లబ్ మాజీ మెంబర్ గాను ఉన్నారు. గేజ్ షార్ట్ గన్, లెవర్ యాక్షన్, పంప్ యాక్షన్ వంటి పలు రకాల రైఫిల్స్ వాడటంలో అనుభవం కలిగి ఉన్నారు.
హరిహర వీరమల్లు విశేషాలు..
నిర్మాత ఏఎం రత్నం 250 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. తొలుత ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. కానీ ప్రాజెక్టు ఆలస్యం కావడం వల్ల ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ రంగంలోకి దిగారు. సినిమా షూటింగ్ని పూర్తి చేశారు. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని జూలై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. జులై 3న ట్రైలర్ విడుదల కాబోతోంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండడం విశేషం.


Click it and Unblock the Notifications











