పాపం రష్మీ.. జబర్దస్త్‌గా దెబ్బేసిన హరితేజ..

ప్రస్తుతం టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్ల కెరీర్‌కు హరితేజ ముప్పుగా మారిందనే మాట బలంగా వినిపిస్తున్నది.

By Rajababu

Recommended Video

పాపం రష్మీ.. జబర్దస్త్‌ యాంకర్ గా హరితేజ..

బిగ్‌బాస్ రియాలిటీ షో ముగిసిన తర్వాత హరితేజ కెరీర్‌ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోతున్నది. అంతకుముందు చిన్న చిన్న పాత్రలకే పరిమితమైన హరితేజ ఇప్పడు టెలివిజన్, సినిమా రంగాల్లో హాట్ సెలబ్రిటీగా మారింది. గతంలో ఎంత ప్రయత్నించినా దక్కని క్రెడిట్ ఒక్కసారిగా బిగ్‌బాస్‌తో వచ్చింది. ప్రస్తుతం టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్ల కెరీర్‌కు హరితేజ ముప్పుగా మారిందనే మాట బలంగా వినిపిస్తున్నది. హరితేజ ప్రతిభాపాటవాలకు, క్రేజ్‌కు మెచ్చి ఆమెకు ఓ కీలకమైన రియాలిటీ షో బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తున్నది.

 కుప్పలు తెప్పలుగా ఆఫర్లు

కుప్పలు తెప్పలుగా ఆఫర్లు

బిగ్‌బాస్‌ హౌస్‌లో హరితేజ ప్రతిభను పసిగట్టిన కొందరు నిర్మాతలు, టెలివిజన్ నిర్వాహకులు ఇటీవల ఆమెను కలువడం జరిగిందట. అయితే ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నా గానీ హరితేజ ఆచితూచీ వ్యవహరిస్తున్నారనేది తాజా సమాచారం. దాదాపు రెండున్నర నెలలు కుటుంబ సభ్యులకు దూరమైన హరితేజ వారితో విలువైన సమయాన్ని గడుపుతున్నదట. అంతేకాకుండా ఓ పక్క చేయబోయే ప్రాజెక్టుల గురించి కూడా పక్కా ప్రణాళిక రచిస్తున్నారట.

 యాంకర్‌గా హరితేజ

యాంకర్‌గా హరితేజ

ఇక బిగ్‌బాస్ అనంతరం ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో మల్లెమాల ప్రొడక్షన్ నిర్వాహస్తున్న ఓ షోకు హరితేజను యాంకర్‌గా తీసుకొన్నారట. మల్లెమాల నిర్మాణ విలువలు, వారు రూపొందించిన ప్రాజెక్టులకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి ఒకే చెప్పినట్టు తెలుస్తున్నది.

యాంకర్ రష్మీకి ఇబ్బంది

యాంకర్ రష్మీకి ఇబ్బంది

అయితే హరితేజకు మంచి అవకాశం రావడం సరేసరి. ఆ కారణంగా హరితేజతో మరో టాప్ యాంకర్ రష్మీకి ఇబ్బంది వచ్చిందట. హరితేజకు మంచి ఫాలోయింగ్ ఉండటం, జబర్దస్త్‌పై కొన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలొ రష్మీని తప్పించాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది.

హరితేజ చేయబోయే

హరితేజ చేయబోయే

హరితేజ చేయబోయే కార్యక్రమం ఏమిటో ఇప్పటికే ఓ అంచనా వచ్చినట్టుంది మీకు. అదేనండి మల్లెమాల పేరు చెప్పగానే టెలివిజన్‌లో బాగా పాపులర్ అయిన కార్యక్రమం జబర్దస్త్ గుర్తుకు వస్తుంది. త్వరలోనే రష్మీని ఆ కార్యక్రమం నుంచి తప్పించనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

రష్మీని చూసి ప్రేక్షకులు

రష్మీని చూసి ప్రేక్షకులు

జబర్దస్త్ కార్యక్రమానికి చాలా సంవత్సరాలుగా రష్మీనే హోస్ట్‌గా కొనసాగుతున్నది. రష్మీని చూసి ప్రేక్షకులు బోరుగా ఫీలవుతున్నారనేది ప్రొడక్షన్ భావిస్తున్నదట. అందుకే రష్మీ స్థానంలో తెలుగులో గడగడ మాట్లాడేస్తూ.. పాటలు చాలా తేలికగా పాడుతూ, మంచి సమయస్ఫూర్తితో ఆకట్టుకొనే హరితేజను తీసుకోవడం జరిగిందనే మాట వినిపిస్తున్నది.

 బిగ్‌బాస్‌లోకి రష్మీ

బిగ్‌బాస్‌లోకి రష్మీ

అయితే జబర్దస్త్ రియాలిటీ షో నుంచి రష్మీనే స్వయంగా తప్పుకొన్నదని, బిగ్‌బాస్2లో ఆమె పేరు పరిశీలనలో ఉండటం కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నదనేది మరో రూమర్. ఒకవేళ బిగ్‌బాస్ ఆఫర్ నిజమైనట్లయితే ఆ రియాలిటీ షోకు మరింత గ్లామర్ వచ్చే అవకాశం ఉంది. రష్మీ గ్లామర్ బిగ్‌బాస్‌‌కు అదనపు ఆకర్షణగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

రష్మీ తప్పించారో లేదా

రష్మీ తప్పించారో లేదా

నుంచి రష్మీని తప్పించారో లేదా స్వయంగా తప్పుకొన్నదో అనే విషయం పక్కన పెడితే జబర్దస్త్ హరితేజ హోస్ట్‌గా వ్యవహరించడం మాత్రం ఖరారైంది. జబర్దస్త్‌‌ షోకు హోస్ట్‌గా చేయడం వల్ల హరితేజ మరింత క్రేజ్‌ను సొంతం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బిగ్‌బాస్‌లో మాదిరిగానే జబర్దస్త్‌ను కూడా హరితేజ మరోస్థాయికి తీసుకెళ్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X