చిరంజీవితో పవన్ కల్యాణ్ పోటీ.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించరు
సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయినప్పటి నుంచి ఏకధాటిగా సినిమాలు చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'బ్రో' వంటి చిత్రాలతో ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను అలరించిన ఈ మెగా హీరో.. ఇప్పుడు రెండు, మూడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అలా పవన్ చేస్తోన్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి.
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపకల్పనలో పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రమే 'హరిహర వీరమల్లు'. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ క్రేజీ మూవీని మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించిన టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కానీ, ఎన్నికల కారణంగా ఈ సినిమాను సుదీర్ఘ కాలం పాటు వాయిదా వేశారు.
ఇప్పట్లో షూటింగ్ జరిగే అవకాశం లేకపోవడంతో 'హరిహర వీరమల్లు' మూవీని ఆపేశారని ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది. ఈ పరిస్థితుల్లో త్వరలోనే గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసి, ఆ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

'హరిహర వీరమల్లు' మూవీకి సంబంధించి ఇప్పటికే ఎన్నో రిలీజ్ డేట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారని సమాచారం లీకైంది. అదే జరిగితే జనవరి 10న రిలీజ్ కానున్న చిరంజీవి 'విశ్వంభర'తో ఇది పోటీ పడుతుంది. మరి దీన్ని మెగా అభిమానులు జీర్ణించుకుంటారా? లేదా? అన్నది చూడాల్సిందే.
ఇదిలా ఉండగా.. 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. బాబీ డియోల్ ఇందులో విలన్‌గా చేస్తున్నాడు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











