హరిహర వీరమల్లుపై దారుణంగా ట్రోలింగ్.. ఆ సీన్స్‌పై మేకర్స్ షాకింగ్ డెసిషన్
ఇటీవలి కాలంలో సినిమాలకు నెగిటివ్ పబ్లిసిటీ, ట్రోలింగ్ పెద్ద తలనొప్పిగా మారింది. పెద్ద హీరోల సినిమాలు రిలీజైన వెంటనే యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. సినిమాపై ఉన్నవి, లేనివి కల్పించి చెబుతూ డ్యామేజ్ చేస్తున్నారు. సినిమా చూడాలని అనుకున్న వారిని కూడా మార్చేస్తూ నిర్మాతలకు నష్టాలను తీసుకొస్తున్నారు. ఎన్నో సినిమాలు ఇలా నెగిటివ్ పబ్లిసిటీ కారణంగా దెబ్బతిన్నాయి. తాజాగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లుపైనా నెగిటివ్ ప్రచారం ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లుగా ఫిలింనగర్‌లో డిస్కషన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది.
హరిహర వీరమల్లు బడ్జెట్
హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి తొలుత క్రిష్ జాగర్లమూడి, ఆ తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలకపాత్ర పోషించారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందించగా.. వీఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించారు.

థియేటర్లలో అభిమానుల సందడి
దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకుని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులకు పండుగే. గడిచిన మూడేళ్లుగా ఇలాంటి సందడి లేక అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఎట్టకేలకు హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలోకి రావడంతో జూలై 23 రాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద అభిమానులు గోలగోల చేస్తున్నారు. వీరమల్లు తాలుకా స్క్రీన్ షాట్లను స్టేటస్‌గా పెట్టుకుంటూ మురిసిపోతున్నారు.
వీరమల్లుపై ట్రోలింగ్
ప్రీమియర్స్ పడిన క్షణం నుంచి హరిహర వీరమల్లుపై నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతోంది. కొన్ని సినిమాల్లోని సీన్స్‌తో వీరమల్లు సీన్స్‌ను పోల్చి చూస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రధానంగా వీరమల్లులోని వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్స్క్‌పై ఎక్కువ ట్రోలింగ్ జరుగుతోంది. కొన్ని యాక్షన్ సీన్స్‌తో పాటు హీరో, హీరోయిన్లు సహా నటీనటులు ఒక్కో ఫ్రేమ్‌లో ఒక్కోలో కనిపిస్తున్నారని.. ఇది నాసిరకంగా సీజీఐ వర్క్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. అలాగే అత్యంత కీలకమైన సెకండాఫ్‌లో గాఫిక్స్ వర్క్ అంచనాలను అందుకోలేదని పవన్ అభిమానులు సైతం డిజప్పాయింట్ అవుతున్నారు.
వీఎఫ్ఎక్స్ మార్పులు?
సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ వ్యవహారం హరిహర వీరమల్లు మేకర్స్ దృష్టికి వెళ్లింది. దీంతో విమర్శలకు తావు ఇవ్వకుండా గ్రాఫిక్ వర్క్స్‌తో పాటు కొన్ని సీన్లలో మార్పులు చేసినట్లుగా చిత్ర పరిశ్రమలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అప్‌డేటెడ్ వెర్షన్‌తో జూలై 24 సాయంత్రం నాటికి లేదా 25 ఉదయం నాటికి థియేటర్‌లలో స్క్రీనింగ్‌కు అందుబాటులోకి వస్తుందని వార్తలు వస్తున్నాయి. వీఎఫ్ఎక్స్ కంపెనీతో జరిగిన ఆలస్యం కారణంగానే ఇలా జరిగిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు సమస్యలన్నీ తీరిపోవడంతో తిరిగి వీరిమల్లు అప్‌డేటెడ్ వెర్షన్‌ను శాటిలైట్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లుగా ఇన్‌సైడ్ టాక్. జూలై 24న హరిహర వీరమల్లు సక్సెస్‌మీట్‌లో వీఎఫ్ఎక్స్ వర్క్స్ గురించి పవన్ కళ్యాణ్ లేదంటే దర్శక నిర్మాతలు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











