Harihara Veeramallu: పవన్ సినిమాకు కొత్త రిలీజ్ డేట్.. ఆ పండుగకే సందడి

పేరుకు మెగా హీరోనే అయినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరచుకుని బడా హీరోగా ఎదిగిపోయాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కెరీర్ ఆరంభంలోనే తనదైన శైలి యాక్టింగ్, స్టైల్స్‌తో అలరించిన అతడు.. అదిరిపోయే హిట్లను కూడా అందుకున్నాడు. అదే సమయంలో స్టార్‌డమ్‌ను కూడా దక్కించుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పాలిటిక్స్ కోసం పవన్ సినిమాలకు విరామం ప్రకటించాడు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇది అనుకున్న రీతిలో స్పందనను అందుకుని భారీ వసూళ్లను రాబట్టడంతో పవన్ రెట్టించిన జోష్‌తో కనిపిస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొద్ది రోజుల క్రితమే 'భీమ్లా నాయక్' అనే సినిమాను అందించాడు. ఇందులో దగ్గుబాటి రాణా కీలక పాత్రలో నటించాడు. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. ఎస్ థమన్ దీనికి సంగీతం అందించాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ, రెండో వారం నుంచి వసూళ్లు భారీగా డౌన్ అయ్యాయి. ఫలితంగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకోలేదు. కానీ, మొత్తంగా ఈ చిత్రం 97 కోట్ల రూపాయలకు పైగా షేర్‌ను రాబట్టి పవన్ కెరీర్‌లోనే బెస్ట్ ఫిగర్స్‌ను సాధించింది.

 Harihara Veeramallu to Release on Sankranthi

మెగా హీరో పవన్ కల్యాణ్ రెండేళ్ల క్రితమే 'హరిహర వీరమల్లు' అనే సినిమాను మొదలు పెట్టిన సంగతి విధితమే. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న ఈ మూవీని ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న ఈ చిత్రంలో ఈ స్టార్ హీరో వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే, దీన్ని మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురు కావడంతో పాటు పవన్ కల్యాణ్ బ్రేక్ తీసుకున్నాడు. ఇక, ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను యూనిట్ ఇటీవలే ప్రారంభించింది. ఇందులో కొన్ని యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తోన్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'హరిహర వీరమల్లు' మూవీని ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై చిత్ర యూనిట్ గతంలో కొన్ని ప్రకటనలు చేసింది. అయితే, అప్పుడు వీలు కాకపోవడంతో దీన్ని వాయిదా వేశారు. ఇక, ఇప్పుడు ఈ సినిమాను దసరా కానుకగా వచ్చే అక్టోబర్‌లో విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ పిరియాడిక్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తారని తెలిసింది. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న చిత్రం కావడంతో దీన్ని వచ్చే జనవరిలో విడుదల చేసి.. భారీ కలెక్షన్లను రాబట్టాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన 60 శాతం షూటింగ్ పూర్తైంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. ఈ మూవీకి భారీ స్థాయిలో రూ. 180 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X