'ప్రయాణం' హీరోయిన్ ని జూ.ఎన్టీఆర్ సరసన...
యేలేటి చంద్రశేఖర్ 'ప్రయాణం' చిత్రంలో హీరోయిన్ గా చేసిన హారిక గుర్తుందా. ఆమెకు ఇప్పుడు గోల్డెన్ టైమ్ వచ్చింది. ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో ఆమెను హీరోయిన్ గా బుక్ చేసారు. తమన్నా ఇప్పటికే ఓ హీరోయిన్ గా చేస్తోంది. ఈ నెలాఖరునుంచి షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. బి.వియస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం రచ్చ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇక హారిక..మిస్టర్ రాస్కెల్ టైటిల్ తో రూపొందుతున్న మరో చిత్రంలోనూ హీరోయిన్ గా చేస్తోంది. అందులో పరుచూరి రవి హీరోగా చేస్తున్నాడు. ఇక సురేంద్రరెడ్డి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో గతంలో అశోక్ చిత్రం వచ్చింది. అలాగే సురేంద్రరెడ్డి కిక్ విజయం తర్వాత చేస్తున్న చిత్రం ఇదే. మరో ప్రక్క ఎన్టీఆర్...శక్తి చిత్రం రిలీజుకు రెడీగా ఉంది.


Click it and Unblock the Notifications











