సీతయ్య సీక్వెల్‌తో హరికృష్ణ రీ-ఎంట్రీ?

By Bojja Kumar

ఆ మధ్య సీతయ్య సినిమా ద్వారా వారెవ్వా అనిపించుకున్న నందమూరి హరికృష్ణ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని, సీతయ్య సీక్వెల్ గా రూపొందబోయే చిత్రంలో నటిస్తున్నారనే ప్రచారం ఫిల్మ్ నగర్, టీడీపీ వర్గాల్లో మొదలైంది. కొన్ని రోజులుగా మీడియాకు కనపడకుండా ఉన్న హరికృష్ణ స్లిమ్ అయి...ఫ్రెంచ్ కట్ గడ్డంతో స్టయిలిష్ గా దర్శనం ఇచ్చారు. దీంతో ఆయన మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారనే ప్రచారం మొదలైంది.

గతంలో సిమ్రాన్ తో జతకట్టి పవర్ ఫుల్ ఫోలీసాఫీర్ నటించిన హరికృష్ణ తన నటన, స్టెప్పులతో నందమూరి అభిమానులను అలరించాడు. ఆ వయసులో ఆయన స్టెప్పులు చూసి తనయుడు జూ ఎన్టీఆర్ కూడా ఆశ్చర్య పోయాడు. ఆ తర్వాత రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నట్లు కనిపించిన హరికృష్ణ ఉన్నట్టుండి సినిమాలకు దూరం అయ్యారు. గత ఆరేళ్లు గా ఆయన ఒక్క సినిమా కూడా చేయలేదు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్య కలాపాల్లో బిజీగా గడుపుతున్న హరికృష్ణ కొన్ని రోజులుగా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఎన్నికల ముందు సినిమాలో నటించి మళ్లీ అభిమానులకు దగ్గరవ్వాలనే ఆలోచనతోనే ఆయన గెటప్ మార్చారనే ప్రచారం జరుగుతోంది. బాలయ్య రాజకీయ ఎంట్రీ ప్రకటన తర్వాత తాను కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే హరికృష్ణ ఈ ఆలోచన చేశారట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తేలాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X