పవన్ కోసం పవర్‌ఫుల్ పోలీస్ స్టోరీ: ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే హిట్ గ్యారెంటీ.!
సినీ పరిశ్రమకు సంబంధించి కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఒకటి. రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు సినిమాలకు దూరమైన ఆయన.... సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ముఖానికి మేకప్ వేసుకోబోతుండడంతో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇక, రీఎంట్రీలో సూపర్ స్పీడు చూపిస్తున్న పవన్ ఏకంగా మూడు సినిమాలకు ఓకే చేసి అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో పవర్ స్టార్ అభిమానులు పండుగ చేసుకునే ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు మీకోసం.!
Recommended Video

నాయకుడిగా వెళ్లి.. లాయర్‌గా ఎంట్రీ
ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఎన్నికలకు సంబంధించిన హడావిడి అయిపోవడంతో ఖాళీగా ఉంటున్న ఆయన... ‘వకీల్ సాబ్' అనే మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ మూవీ ‘పింక్'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఏకంగా ఇద్దరు డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్
రీఎంట్రీ మూవీ కావడంతో ‘వకీల్ సాబ్'ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. వ్యభిచార గృహంలో చిక్కుకున్న యువతులను రక్షించే లాయర్‌గా ఇందులో పవన్ నటిస్తున్నాడు. ఇదిలాఉండగా... ఈ మూవీ పట్టాలపై ఉండగానే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్. అందులో ఒకటి క్రిష్, రెండోది హరీశ్ శంకర్ రూపొందించనున్నారు.

మూడూ... మూడు రకాల జోనర్లతో
ప్రస్తుతం నటిస్తున్న ‘వకీల్ సాబ్'తో పాటు క్రిష్, హరీశ్ శంకర్ తెరకెక్కించే సినిమాలు మూడూ... మూడు జోనర్లలో రూపొందనున్నాయి. కమ్‌బ్యాక్ మూవీ సోషల్ మెసేజ్‌తో వస్తుండగా.. ఏఎమ్ రత్నం నిర్మాణంలో క్రిష్ తీసే సినిమా పిరియాడిక్ జోనర్‌లో తెరకెక్కనుంది. అలాగే, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే హరీశ్ శంకర్ మూవీ పక్కా కమర్షియల్ జోనర్‌లో వస్తుంది.

బెడిసి కొట్టిన పవన్ కల్యాణ్ ప్లాన్స్
రాజకీయాల్లో వచ్చిన గ్యాప్‌ను సద్వినియోగం చేసుకునేందుకు పవన్ కల్యాణ్ పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు ఒప్పుకున్నాడు. కానీ, కరోనా రూపంలో ఆయనకు భారీ షాక్ తగిలింది. లాక్‌డౌన్ కారణంగా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ‘వకీల్ సాబ్' వాయిదా పడగా.. మిగతా ప్రాజెక్టులపైనా ఆ ప్రభావం భారీగా పడిపోయింది.

పవన్ కల్యాణ్ కోసం పవర్‌ఫుల్ స్టోరీ
చాలా కాలంగా పవన్ కల్యాణ్ రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు పవన్ కల్యాణ్ అభిమానులు. ఆ కోరిక త్వరలోనే తీరబోతుందని అనుకుంటున్న సమయంలో కరోనా దెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో వాళ్లలో జోష్ నింపే ఓ న్యూస్ ఇండస్ట్రీలో తాజాగా చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.... పవర్ స్టార్ కోసం స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్ పవర్‌ఫుల్ పోలీస్ స్టోరీని రెడీ చేశాడట.

ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే హిట్టే
గతంలో హరీశ్ శంకర్ - పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో ‘గబ్బర్ సింగ్' అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో పవర్ స్టార్‌కు బ్రేక్ ఇచ్చిన సినిమా ఇది. పోలీస్ కథతో తెరకెక్కిన ఈ మూవీ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు కూడా అదే తరహా కథతో వస్తుండడంతో హిట్ గ్యారెంటీ అని పీకే ఫ్యాన్స్ అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











