గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం, దువ్వాడ జగన్నాథమ్.. మరి చిన్నల్లుడు ఏమిటో, అతడిపైనే గురి!
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న విజేత చిత్రం జులై 6 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజేత చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ఫస్ట్ లుక్ మొదలుకుని టీజర్, పాటలు, ట్రైలర్ అన్ని ఆడియన్స్ ని ఆకట్టుకునేవిగా ఉన్నాయి. విజేత చిత్రంలో తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ అంశాలతో పటు రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా చూపించబోతున్నారు. తొలి ప్రయత్నంలోనే నటుడిగా కళ్యాణ్ దేవ్ కు మంచి మార్కులే పడుతున్నాయి. ఇక చిత్రం విడుదలయ్యాక ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. ఇదిలా ఉందిగా కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రంపై ఆసక్తికరమైన ప్రచారం ఫిలిం నగర్ లో జరుగుతోంది.
Recommended Video


విజేతతో మెప్పిస్తాడా
కళ్యాణ్ దేవ్ నటిస్తున్న విజేత చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. చిరు అల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ దేవ్ తొలి చిత్రంలో ఎలా నటించాడు అని అందరూ ఎదురుచూస్తున్నారు.

విడుదల కాకముందే
విజేత చిత్రం విడుదల కాకముందే కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రం గురించి చర్చ మొదలైపోయింది. లుక్స్ పరంగా కళ్యాణ్ దేవ్ అందరిని ఆకర్షించే విధంగా ఉన్నాడు. నటుడిగా ప్రూవ్ చేసుకుంటే అతడు హీరోగా స్థిరపడ్డట్లే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

హరీష్ శంకర్ అంటూ
కళ్యాణ్ దేవ్ రెండవచిత్రానికి దర్శకుడు హరీష్ శంకర్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మెగా క్యాంప్ హరీష్ తో చర్చలు జరుపుతోందని త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

మెగా హీరోలకు కలసివచ్చిన దర్శకుడు
హరీష్ శంకర్ మెగా హీరోలకు కలసివచ్చిన దర్శకుడు అని చెప్పొచ్చు. హరీష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి ఘనవిజయమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాయిధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సెల్, బన్నీతో దువ్వాడ జగన్నాథమ్ చిత్రాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.

మరి కళ్యాణ్ దేవ్ తో ఎలాంటి చిత్రమో
ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం హరీష్ శంకర్ కళ్యాణ్ దేవ్ కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మెగా హీరోలతో హిట్ చిత్రాలు తెరకెక్కించిన హరీష్.. చిరు చిన్నల్లుడిని ఎలా చూపిస్తాడో అని అభిమానులు ఇప్పటినుంచే చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.


Click it and Unblock the Notifications











