'ఖైదీ' రీమేక్ కి డైరక్టర్ ఎవరు

By Srikanya

హైదరాబాద్: పరిశ్రమ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్...చిరు ఖైదీ చిత్రం రీమేక్ కు డైరక్షన్ ఎవరు చేయబోతున్నారనేది. గతంలో పూరీ జగన్నాధ్ ఈ చిత్రం ఈ కాలానికి తగినట్లు మార్చి, మహేష్ తో రీమేక్ చేస్తారని అన్నారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. చిరు తనయుడు రామ్ చరణ్ సీన్ లోకి వచ్చారు. ఆయనతో ఈ చిత్రం రీమేక్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు చిరుని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ దే ఫైనల్ నిర్ణయమని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం.

అయితే రామ్ చరణ్ ఈ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ రీమేక్ కు ఎవరు న్యాయం చేయగలరు అనేది చర్చనీయాంశమైంది. అప్పుడు వారి దృష్టిలో కి వచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ అని తెలుస్తోంది. దబాంగ్ చిత్రాన్ని గబ్బర్ సింగ్ గా రీమేక్ చేసి హిట్ కొట్టిన హరీష్ అంతకు ముందు కూడా మైహూనా చిత్రాన్ని తనదైన శైలిలో మార్చి మిరపకాయగా హిట్ కొట్టారు. దాంతో హరీష్ శంకర్ అయితే రీమేక్ కు న్యాయం చేయగలరని మెగా క్యాంప్ భావిస్తోంది. అందులోనూ హరీష్ తో అయితే రామ్ చరణ్ కి సైతం చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అప్పట్లో రూపుదిద్దుకున్న 'ఖైదీ' చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి విదితమే. ఈ చిత్రంతో చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు. సంచలన విజయం సాధించిన ఆ చిత్రం మళ్లీ రాబోతోంది. నిర్మాతలు మాత్రం...ఓ ప్రముఖ కథానాయకుడు నటించే ఈ చిత్రానికి ప్రసిద్ధ దర్శకుడు దర్శకత్వం వహిస్తారు అని చెప్తున్నారు. తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించి, ప్రస్తుతం గోపీచంద్‌తో ఓ భారీ సినిమా తీస్తున్న జయబాలాజీ రియల్ మీడియా అధినేత తాండ్ర రమేశ్ 'ఖైదీ' హక్కుల్ని సొంతం చేసుకున్నారు.

నిర్మాత మాట్లాడుతూ...'నాటి సెన్సేషనల్ హిట్ 'ఖైదీ'ని నేటి మేటి హీరోతో మళ్లీ నిర్మిస్తున్నాం. వరుస విజయాలను అందిస్తున్న ఓ ప్రముఖ దర్శకుడు దీనికి దర్శకత్వం వహిస్తారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X