పవన్ పై నమ్మకంలేక...రవితేజతో సేఫ్ జోన్ వెతుకుంటున్నాడు...
పవన్ కళ్యాణ్ చాలా పెద్ద స్టార్ అనే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. అలా అని అతడితో సినిమా తీసిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే గ్యారెంటీ లేదు. ఇప్పటికీ పవన్ పేరు చెప్పి వృద్దిలోకి వచ్చినవారెవరంటే పూరి జగన్నాథ్, కరుణాకరన్ వంటి కొందరు మాత్రమే. చాలా మందికి పవన్ పైత్యం కారణంగా పరాజయాలు ఎదురయ్యాయి. అందుకే ఇప్పుడు సినిమా చేస్తున్నా కానీ బ్లాక్ బస్టర్ ఇస్తాననే భరోసాతో ఎవరూ ఉండలేకపోతున్నారు.
మిరపకాయ్ దర్శకుడు హరీష్ శంకర్ విషయానికి వస్తే పవన్ తో 'గబ్బర్ సింగ్"ఓకే అయినా కానీ ఆ సినిమా ఏమవుతుందోననే నమ్మకం లేక రవితేజతో చాలా క్లోజ్ గా ఉంటున్నాడు. ఒక వేళ సినిమా అటు ఇటు అయితే వెంటనే రవితేజతో ఒక సినిమా చేసి సేఫ్ జోన్ లోకి వచ్చేయాలని చూస్తున్నాడు. ఇలా ముందు చూపు లేకే కొందరు దర్శకులు పవన్ కళ్యాణ్ సినిమా చేసిన తర్వాత కనుమరుగైపోయారు.


Click it and Unblock the Notifications











