మాస్ డైరెక్టర్‌కు విజయ్ దేవరకొండ షాక్.. కలుద్దామంటే అంత మాట అన్నారట..
సినిమా అనేది.. రంగుల ప్రపంచం. బయటనుంచి చూసేవారికి బాగానే అనిపించినా.. ఇండస్ట్రీలో ఉన్న వారికే తెలుస్తుంది. అక్కడి బాధలు ఎలా ఉంటాయో. సక్సెస్ అనేది లేకుంటే ఎవర్నీ ఎవరూ లెక్క చేయరు. అదే ఒక్క హిట్టు కొట్టి ఫామ్లోకి వస్తే.. మళ్లీ నీరాజనాలు పడతారు.

మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు హరీష్
ఒక రీమేక్ సినిమాను తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించడంలో హరీష్ శంకర్ సిద్దహస్తుడు. లేకపోతే దబాంగ్ లాంటి యాక్షన్ సినిమాను తెలుగులో గబ్బర్ సింగ్ అంటూ తీసి రికార్డులన్నీ ఎలా బ్రేక్ చేయగలడు. అయితే హరీష్ కెరీర్ ముందు నుంచీ ఒక హిట్టు, ఒక ఫ్లాపు అన్న చందంగా మారింది. డీజే సినిమా తరువాత.. తన తదుపరి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా హరీష్ కు మంచి పేరుంది.

మరోసారి రీమేక్ తో భారీ హిట్టు కొట్టిన దర్శకుడు
తమిళ సూపర్ హిట్ మూవీ జిగర్తాండను తెలుగులో గద్దలకొండ గణేష్ గా మలిచాడు. వరుణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా కథలో మార్పులు చేసి.. తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే సరైన సక్సెస్ చూసి చాలా కాలమైన హరీష్ కు ఈ మూవీ మంచి ఊరటనిచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుండగా.. మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ సినిమా ప్రమోషన్స్ పెంచేస్తున్నాడు.

విజయ్ విషయంలో డిజప్పాయింట్..
ఓ మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ గురించి మాట్లాడుతూ.. అతనొక యూత్ ఐకాన్ అని చెప్పుకొచ్చాడు. అయితే విజయ్ కి ఎప్పుడైన కథ చెప్పారా? అని ప్రశ్నించాడు. కథ అయితే చెప్పలేదు కానీ అప్పుడప్పుడు వాట్సప్‌లో చాట్ చేస్తుంటామని తెలిపాడు. అర్జున్ రెడ్డి సమయంలో.. ఓ సారి కలుద్దామని మెసేజ్ పెట్టానని తెలిపాడు. అన్నా.. ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బిజీగా ఉన్నాను.. సినిమా గురించి కాకపోతే కలుద్దామని విజయ్ రిప్లై పెట్టాడట.
దాంతో విజయ్ దేవరకొండకు రిప్లై ఇస్తూ సినిమా టాపిక్ తప్పా నీకు నాకు ఏం ఉంటుంది భయ్యా.. సరే వన్ అండ్ హాఫ్ ఇయర్ తరువాతే కలుద్దామని నేనూ మెసెజ్ పెట్టానని అప్పటి సంఘటనను హరీష్ చెప్పుకొచ్చాడు. తాజాగా మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన హరీష్‌ను విజయ్ దేవరకొండ కలిసేందుకు ప్రయత్నిస్తారా లేదా వేచి చూడాల్సిందే. కాగా, వరల్డ్ ఫేమస్ లవర్, మరో చిత్రంతో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











