నిర్మాతగా మారనున్న మరో స్టార్ డైరెక్టర్.. కొత్త దర్శకుడితో థ్రిల్లర్ మూవీ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కొంతమంది దర్శకులు నిర్మాతలుగా మారుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ లిస్ట్ లోనే గబ్బర్ సింగ్ దర్శకుడు కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. శిష్యులకు అవకాశం ఇచ్చి చిన్న బడ్జెట్ లో నచ్చిన సినిమాలను తెరకెక్కించాలని చాలా మంది దర్శకులకు ఉంటుంది. అయితే ఒక సినిమాపై ఓకేసరి కోట్లల్లో ఇన్వెస్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఒక వేళ నష్టం వస్తే కొలుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది.
అందుకే ఈ మధ్య కాలంలో దర్శకులు ఇతర నిర్మాతలతో కలిసి సినిమాలను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక నెక్స్ట్ హరీష్ శంకర్ కూడా మెగా ప్రొడ్యూసర్ బన్నీ వాసుతో కలిసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను నిర్మించనున్నాట్లు తెలుస్తోంది. కథ బాగా నచ్చడంతోనే హరీష్ శంకర్ నిర్మాతగా మారుతున్నాడట. ఆ సినిమా సక్సెస్ అయితే భవిష్యత్తులో తన శిష్యులతో మరిన్ని సినిమాలను నిర్మించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కోసం కొత్త కథను రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. కేవలం స్టోరీ లైన్ విని హరీష్ శంకర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ తరువాత డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే అభిమానుల్లో అంచనాల డోస్ తారా స్థాయికి చేరింది. వకీల్ సాబ్, వీరుపాక్ష సినిమాల అనంతరం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.


Click it and Unblock the Notifications











