twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హరీష్ శంకర్,ఎన్టీఆర్ చిత్రం ఇప్పుడిప్పుడే కాదు

    By Srikanya
    |

    హైదరాబాద్ : జూ.ఎన్టీఆర్,హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఈ చిత్రం విషయమై దర్శకుడు హరీష్ శంకర్ కి డేట్స్ విషయమై క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం తాను చేస్తున్న బాద్షా చిత్రం పూర్తయ్యేదాకా మరో చిత్రం చేయనని చెప్పినట్లు సమాచార. డిసెంబర్ నుంచి కంటిన్యూ డేట్స్ ఇస్తానని,అప్పటికి స్క్రిప్టు పూర్తి చేసుకోమని హరీష్ కి చెప్పినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రం స్కిప్టుని రీసెంట్ గానే ఎన్టీఆర్ పూర్తిగా విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు.

    ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, ఇమేజ్‌కు సరిపోయే ఓ విభిన్నమైన మాస్ ఎంటర్‌టైనర్ కథను హరీష్ సిద్ధం చేశాడని చెప్తున్నారు. ఇటీవల ఈ కథను విన్న ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ముఖ్యంగా మాస్ కి నచ్చే ఎలిమెంట్స్ అన్ని హరీష్ కూర్చి ఈ కథను జన రంజకంగా తెరకెక్కించనున్నాడని టాక్. చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రం స్క్రీన్ ప్లే ఇప్పటికీ పూర్తి చేసారు. పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే మేకర్స్ ఈ విషయాన్ని నిర్దారించలేదు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చిత్రం ఉంటుందని చెప్తున్నారు. గతంలో దిల్ రాజు,ఎన్టీఆర్ కాంబినేషన్ లో బృందావనం చిత్రం వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే.

    మరో ప్రక్క ఎన్టీఆర్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'బాద్‌షా' చిత్రం రెగ్యులర్ షూటింగ్ బ్యాంకాక్ లో జరుపుకుని హైదరాబాద్ వచ్చేసింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత బండ్ల గణేష్‌బాబు తెలియజేస్తూ' యాక్షన్‌తో అంశాలతో పాటు ఓ అందమైన ప్రేమకథ కూడా ఈ చిత్రంలో వుంది. ఈ చిత్రంలో శ్రీనువైట్ల కొత్త ఎన్టీఆర్‌ను చూపించబోతున్నాడు. ముఖ్యంగా బ్యాంకాక్,ఇటలీలో షూట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు.

    బాద్షా చిత్రం గురించి నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ...ఆయన ఇమేజ్, శారీరక భాషకు సరిగ్గా సరిపోయే కథ. ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులు ఆశిస్తున్న అంశాలు ఇందులో పుష్కలంగా వున్నాయి. ఇంతకు ముందు 'అదుర్స్' చిత్రంలో తన కామెడీ టైమింగ్‌తో అందర్ని నవ్వించిన ఎన్టీఆర్ ఈ చిత్రంలో ప్రేక్షకులను మరింతగా అలరించనున్నాడు. ఇప్పటి వరకు చేయని ఓ విభిన్నమైన పాత్రను ఆయన ఇందులో చేస్తున్నాడు. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ మెప్పు పొందుతుందనే విశ్వాసం వుంది' అన్నారు.జనవరి 11, 2012 న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

    English summary
    Director Harish Shankar of Gabbar Singh fame is giving final touches to his next film with NTR. But the NTR has not given dates to the film. He reportedly told Harish Shankar to plan the shooting schedules only from December. By then, he'd be finishing off Baadshah. Dil Raju is producing this Harish Shankar- NTR's film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X