పవన్ - హరీశ్ శంకర్ సినిమా కథ లీక్: తొలిసారి అలాంటి పాత్రలో పవర్ స్టార్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు పవన్ కల్యాణ్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్న అతడు.. మధ్యలో కొన్ని పరాజయాలతో సతమతం అయ్యాడు. రాజకీయాల కోసం గ్యాప్ తీసుకుని.. ఇటీవలే 'వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. పవర్ స్టార్ ప్రభావం బాక్సాఫీస్‌పై భారీగానే పడింది. ఈ నేపథ్యంలోనే హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించబోయే సినిమా కథ తాజాగా బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

Recommended Video

Pawan Kalyan The Real Trend Setter In Tollywood | #20YearsForClassicIHKushi || Filmibeat Telugu
‘వకీల్ సాబ్'తో అదిరిపోయే పవన్ రీఎంట్రీ

‘వకీల్ సాబ్'తో అదిరిపోయే పవన్ రీఎంట్రీ

పవన్ కల్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే, టికెట్ రేట్ల తగ్గింపుతో పాటు కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోలేదు.

మరో రెండు పట్టాలెక్కించేసి పవన్ కల్యాణ్

మరో రెండు పట్టాలెక్కించేసి పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ ప్రస్తుతం మలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌లో దగ్గుబాటి రానాతో కలిసి నటిస్తున్నాడు. సాగర్ కే చంద్ర రూపొందిస్తోన్న ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నాడు. అలాగే, క్రిష్ జాగర్లమూడితో కలిసి 'హరిహర వీరమల్లు' అనే పిరియాడిక్ మూవీని కూడా చేస్తున్నాడు. మెగాసూర్య బ్యానర్‌పై ఏఎమ్ రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

గబ్బర్ సింగ్ కాంబో.. ఇప్పుడే మొదలైంది

గబ్బర్ సింగ్ కాంబో.. ఇప్పుడే మొదలైంది

'వకీల్ సాబ్' మూవీ షూటింగ్ ప్రారంభం అయిన సమయంలోనే పవన్ కల్యాణ్.. హరీశ్ శంకర్‌తో సినిమా చేయబోతున్నాడని ప్రకటన వెలువడింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'గబ్బర్ సింగ్' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఈ చిత్రం రాబోతుండడంతో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. దీనికి 'ఇప్పుడే మొదలైంది' అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది.

ఆ పుకార్లతో సినిమా కథపై అనుమానాలు

ఆ పుకార్లతో సినిమా కథపై అనుమానాలు

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించబోయే సినిమా విషయంలో ఎన్నో అంశాలు తెరపైకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ చిత్ర కథ విషయంలో కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. ఇది ఠాగూర్ తరహా సినిమా అని.. ఇందులో పవన్ ప్రొఫెసర్‌గా నటిస్తున్నాడని కొందరు అన్నారు. అలాగే, పోలీస్ ఆఫీసర్ కథ అని, పాలిటిక్స్ నేపథ్యంతో కూడిందని మరికొందరు చెప్పారు.

పవన్ - హరీశ్ శంకర్ సినిమా కథ రివీల్

పవన్ - హరీశ్ శంకర్ సినిమా కథ రివీల్

పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ సినిమా కథ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కబోతుందట. తన తండ్రి మరణానికి కారణం అయిన వాళ్లపై హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్న కథతో ఈ సినిమా రూపొందుతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. పాత స్టోరీనే అయినా.. దీన్ని సందేశాత్మకంగా తీస్తున్నారని తెలిసింది.

తొలిసారి అలాంటి పాత్రలో పవన్ కల్యాణ్

తొలిసారి అలాంటి పాత్రలో పవన్ కల్యాణ్

ఇక, ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పార్టులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించే అతడు.. ప్రస్తుత కథలో మాత్రం మాస్ లుక్‌తో దర్శనమిస్తాడని చెబుతున్నారు. గతంలో చూపించేది తండ్రి పాత్ర అని తెలిసింది. పవన్ కల్యాణ్ ఇంతకు ముందెన్నడూ తండ్రి కొడుకులుగా నటించకపోవడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X