పవన్, రవితేజ మల్టీ స్టారర్.. స్టార్ డైరెక్టర్ దద్దరిల్లే ప్లాన్‌తో!
గడిచిన కొన్నేళ్ల సినిమా చరిత్ర తిరగేస్తే వీటిలో అత్యధికంగా భారీ పాన్ ఇండియా చిత్రాలు అలాగే పలు సీక్వెల్ చిత్రాలు ఇంకా క్రేజీ మల్టీ స్టారర్ సినిమాలే అత్యధికంగా కనిపిస్తాయి అని చెప్పాలి. సౌత్ నుంచి కొన్ని సినిమాలు సెట్ చేసిన స్టాండర్డ్స్ దెబ్బతో ఇక చాలా సమీకరణాలు మారిపోయాయి. అలా అక్కడ నుంచి భారీ స్కేల్ తో కూడిన సినిమాలు ఇండియన్ సినిమా దగ్గర మొదలు కాగా సౌత్ నుంచి నార్త్, నార్త్ నుంచి సౌత్ ఇలా నటీనటులు, దర్శకులూ ఇంకా నిర్మాతలు కూడా షఫుల్ అవుతూ భారీ చిత్రాలు చేయడం మొదలు పెడుతున్నారు.
కాగా ఈ క్రమంలో పలు క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాలు కూడా వాస్తు ఆడియెన్స్ కి పెద్ద ఎత్తున ట్రీట్ అందిస్తున్నారు. అయితే ఈ మల్టీ స్టారర్ చిత్రాల్లో కూడా మన తెలుగు నుంచి పలు సినిమాలు ట్రెండ్ సెట్ చేసాయి. అసలు ఒక ఊహించని మల్టీ స్టారర్ గా రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో దర్శకుడు రాజమౌళి RRR చిత్రాన్ని తీసుకురాగా ఈ చిత్రం తర్వాత మరిన్ని సాలిడ్ మల్టీ స్టారర్స్ దేశవ్యాప్తంగా పడ్డాయి.

మరి ఇదిలా ఉండగా తెలుగు సినిమాలో మాత్రం కొన్ని చిరకాల మల్టీ స్టారర్ చిత్రాలు ఐతే చాలానే ఉన్నాయి అని చెప్పాలి. వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్, రెబల్ స్టార్ ప్రభాస్ అల్లు అర్జున్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల కాంబినేషన్ ఇలా కొన్ని ఉన్నాయి. అయితే వీటితో పాటుగా ఓ క్రేజీ మల్టీ స్టారర్ కోసం తెలుగు ఆడియెన్స్ ఈగర్ గా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు.
మరి ఆ సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మాస్ మహారాజ రవితేజల కాంబినేషన్ కోసం. మరి ఈ సెన్సేషనల్ కాంబినేషన్ కానీ పడితే థియేటర్స్ దద్దరిల్లడం, బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అని పవర్ - మాస్ అభిమానులు అనుకుంటారు. కానీ ఈ మల్టీ స్టారర్ సినిమా ఎప్పుడు పడుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఆ మధ్య ఎప్పుడో తమిళ చిత్రం "విక్రమ్ వేదా" కి రీమేక్ గా తెలుగులో ఈ ఇద్దరూ నటిస్తారు అని కొన్ని రూమర్స్ వచ్చాయి కానీ అవి పక్కకి వెళ్లాయి.

కాగా ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కలయికపై ఆశలు చిగురిస్తున్నాయి. మరి ఈ భారీ కాంబినేషన్ పై ఓ సినిమాని స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ డిజైన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు తెలిసింది. హరీష్ ఈ ఇద్దరికీ ఎలాంటి హిట్స్ ఇచ్చాడో అందరికీ తెలుసు. మరి అలాంటిది ఇద్దరు మాస్ పవర్ హౌస్ లని ఒకే సినిమాలో పెట్టడం అనేది నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మరి ఈ క్రేజీ కలయికపై హరీష్ ప్రస్తుతానికి వర్క్ చేస్తున్నాడట. మరి అన్నీ సెట్టయ్యి ఈ కాంబినేషన్ లో కానీ సినిమా పడితే మాత్రం ఆ యుఫోరియా మరో స్థాయిలో ఉంటుంది అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











