చిరంజీవికే నో చెప్పిన స్టార్ డైరెక్టర్.. పవన్ కల్యాణ్ కోసమే ఈ కఠిన నిర్ణయం!

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో హరీశ్ శంకర్ ఒకరు. మాస్ మహారాజ్ రవితేజ - జ్యోతిక కాంబినేషన్‌లో వచ్చిన 'షాక్' అనే మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ వెంటనే అదే హీరోతో 'మిరపకాయ్' అనే సినిమా చేశాడు. దీనిని ప్రేక్షకులు బాగానే ఆదరించడంతో పేరున్న దర్శకుడిగా మారిపోయాడు. దీని తర్వాత తీసిన 'గబ్బర్ సింగ్'తో హరీశ్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడమే దీనికి కారణం.

గబ్బర్ సింగ్ మూవీ తర్వాత హరీశ్ శంకర్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. దీంతో హీరోలందరూ ఆయనతో సినిమా చేయాలని భావించారు. అందుకు అనుగుణంగానే కొన్ని చిత్రాలను తెరకెక్కించాడు. వీటిలో చాలా వరకు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక, ఈ మధ్య వచ్చిన 'గద్దలకొండ గణేష్'తో తన కెరీర్‌లో మరో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు హరీశ్. దీని తర్వాత తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌తో మరో సినిమా చేయబోతున్నాడు. ఇలాంటి సమయంలో ఆయనకు ఊహించని ఆఫర్ వచ్చిందట.

Harish Shankar Reject Chiranjeevis Lucifer Remake

రీఎంట్రీలో స్పీడు చూపిస్తున్న మెగాస్టార్ చిరంజీవి... 'ఆచార్య' తర్వాత 'లూసీఫర్' మూవీ రీమేక్ చేయనున్నారు. దీనికి మొదట సుజిత్‌ను డైరెక్టర్‌గా అనుకున్నారు. కానీ, అతడు తప్పుకోవడంతో వినాయక్‌ను రంగంలోకి దించాలని భావించారు. అది కూడా వర్కౌట్ కాకపోవడంతో హరీశ్ శంకర్‌తో మంతనాలు జరిపినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. అయితే, పవన్‌తో సినిమా కమిట్ అయిన కారణంగా ఆ ఆఫర్‌ను ఈ స్టార్ డైరెక్టర్ సున్నితంగా తిరస్కరించాడట. అంతేకాదు, ఇటీవలే తన ప్రాజెక్టు గురించి పవర్ స్టార్‌తో చర్చలు కూడా జరిపాడట హరీశ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X