నవంబర్ 3 నుంచి హరీష్ శంకర్ కొత్త చిత్రం

By Srikanya

హైదరాబాద్ : గబ్బర్ సింగ్ చిత్రం సూపర్ హిట్ తో ఒక్కసారి గా ఫామ్ లోకి వచ్చిన హరీష్ శంకర్ ఆ తర్వాత వచ్చిన రామయ్యా వస్తావయ్యా డిజాస్టర్ తో అంతే స్పీడుగా వెనకపడ్డారు. అయితే ఆయన ఈ సారి గబ్బర్ సింగ్ కన్నా సూపర్ హిట్ కొట్టాలనే ఆలోచనతో ఓ కథని రెడీ చేసుకున్నట్లు సమచారం. ఆ కథతో నవంబర్ 3 న షూటింగ్ మొదలెట్టనున్నారని తెలుస్తోంది. ఆ రోజు కార్తీక సోమవారం కావటంతో సెంటిమెంట్ గా ఆ రోజునే చిత్రం లాంచ్ చేసి షూటింగ్ మొదలెడతారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇంతకీ ఎవరా హీరో అంటారా... సాయి ధరమ్ తేజ.

త్వరలో ప్రారంభం కాబోయే ఈ చిత్రానికి లొకేషన్స్ నిమిత్తం ఆ మధ్యన యుఎస్ వెళ్లారు. సుబ్రమణ్యం ఫర్ సేల్ అనే టైటిల్ ని ఈ చిత్రానికి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ మధ్యన స్టార్ హంట్ సైతం నిర్వహించారు అదేమైందో తెలియదు. వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో ఈచిత్రం తెరకెక్కబోతోంది. దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారని చెప్పారు.

Harish Shankar's New Film On Nov 3rd

ఇక చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ 'రేయ్‌'తో హీరోగా మారాడు. ఈ చిత్రం ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం 'పిల్లా నువ్వు లేని జీవితం' అనే చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఆయన మూడో చిత్రం ఇలా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' పేరుతో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు సమాచారం. త్వరలోనే సాయి ధరమ్ తేజ హీరోగా తెలుపుతూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

'పిల్లా నువ్వు లేని జీవితం' విషయానికి వస్తే..

సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా, రెజినా హీరోయిన్ గా మెగా ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్ఠ‌లు గీతా ఆర్ట్స్ మ‌రియు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియోష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పిల్లా నువ్వు లేని జీవితం. బన్ని వాసు, శ్రీ హ‌ర్షిత్‌లు నిర్మాత‌లు, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రాకున్నా...ఆయన ఆశీస్సులు వచ్చాయి! ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌కుడు..ఈ ఆడియోని అక్టొబ‌ర్ 25న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మెగా అభిమానుల స‌మ‌క్షంలొ విడుద‌ల చేసారు.

జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రఘు బాబు, దువ్వాసి మోహన్, రాజిత, సత్య కృష్ణ, సురేఖ వాణి తదితరులు నటిస్తున్న చిత్రానికి, మాటలు : డైమండ్ రత్నం , పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి , చంద్రబోస్, అశోక్ తేజ్, శ్రీమణి, సంగీతం : అనూప్ రూబెన్స్, కెమెరా : దాశరధి శివేంద్ర , ఆర్ట్ : రమణ వంక, ఎడిటింగ్ : గౌతంరాజు, ex- ప్రొడ్యూసర్ : సత్య, నిర్మాతలు : బన్నీ వాసు, శ్రీ హర్షిత్, కథ-స్క్రీన్ప్లే -మాటలు-దర్శకత్వం : ఏ.ఎస్ .రవి కుమార్ చౌదరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X