twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్‌కే షాకిచ్చిన స్టార్ డైరెక్టర్.. అన్నయ్యనే కాదని.. ఇదీ అసలు సంగతి!!

    |

    మెగాస్టార్ చిరంజీవే పిలిచి అవకాశమిస్తానంటే.. చేయనని తల అడ్డం ఊపే దర్శకుడుంటారా? అలాంటి సాహసం కూడా ఎవ్వరూ చేయరు. చేయలేరు. అయితే ఓ దర్శకుడు మాత్రం నో చెప్పాడట? మరో క్రేజీ ఆఫర్ రావడంతో చిరు ప్రాజెక్ట్‌ను లెక్కలోకి తీసుకోలేదట. అయితే ఆ దర్శకుడు ఎవరు? ఆయనకు వచ్చిన క్రేజీ ఆఫర్ ఏంటి? మరి చిరు తలిచిన ఆ ప్రాజెక్ట్ కథ ఏమైందనే విషయాలు ఓ సారి చూద్దాం.

    రీమేక్ స్పెషలిస్ట్..

    రీమేక్ స్పెషలిస్ట్..

    ఓ భాషలో మ్యాజిక్ క్రియేట్ చేసిన సినిమాను మరో చోట రీమేక్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేయడం మామూలు విషయం కాదు. మన నేటివిటీకి తగ్గట్టు తగిన మార్పులు చేయాల్సి వస్తుంది. ఇలా చేసిన మార్పులు కూడా అన్ని సార్లు వర్కౌట్ అవుతాయని చెప్పలేము. అయితే గబ్బర్ సింగ్ కోసం హరీష్ శంకర్ చేసిన మార్పులు మాత్రం ఇండస్ట్రీ రికార్డులు కొట్టేలా చేసింది. దీంతో హరీష్ శంకర్ రీమేక్ స్పెషలిస్ట్‌గా మారిపోయాడు.

    రీమేక్‌ బాధ్యతలు..

    రీమేక్‌ బాధ్యతలు..

    లూసిఫర్ రీమేక్ బాధ్యతల కోసం మొదటగా సుకుమార్‌ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. తనకు రీమేక్‌లంటే నచ్చవని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. అయితే హరీష్ శంకర్‌ను కూడా అడిగినట్టు సమాచారం. అయితే అతను మాత్రం నో చెప్పి మెగాస్టార్‌కే షాకిచ్చినట్టు టాక్.

    పవన్‌తో క్రేజీ ఆఫర్..

    పవన్‌తో క్రేజీ ఆఫర్..

    ఎప్పటి నుంచో పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న తరుణం వచ్చింది. మళ్లీ గబ్బర్ సింగ్ కాంబో కావాలంటూ గత కొన్నేళ్ల నుంచి అర్థిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు వీరిద్దరి కాంబోలో ఓ చిత్రం రాబోతోంది మైత్రీ మూవీస్ ప్రకటించింది.

    Recommended Video

    Mahesh Babu In An Aggressive Role In Chiru 152 | Megastar Chiranjeevi | Koratala Siva
     లైన్లోకి వివి వినాయక్..

    లైన్లోకి వివి వినాయక్..

    పవన్‌తొ ప్రాజెక్ట్ కారణంగానే చిరు రీమేక్ సినిమాను కాదనుకున్నాడని టాక్. అయితే చిరు కోసం సపరేట్‌గా ఓ కథ రెడీగా ఉందని, ముందు పవన్‌తో సినిమా చేస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఈ రీమేక్‌ను వివి వినాయక్‌ చేతిలో పెట్టినట్టు తెలుస్తోంది.

    English summary
    Harish Shankar Says No To Chiranjeevi Lucifer Remake. Buzz Is That harish Shankar Says No To Lucifer Remake Because of Pawan Kalyan Project.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X