For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'కెమెరామేన్ గంగతో..' కి హరీష్ శంకర్ ఫైనల్ టచెస్??

  By Srikanya
  |

  హైదరాబాద్: పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రానికి గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ఫైనల్ టచెస్ ఇస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. పూరీ జగన్నాధ్ క్యాంప్ కు చెందిన హరీష్ శంకర్..తనకు అత్యంత ఇష్టమైన హీరో పవన్ చిత్రానికి తుది మెరుగులు దిద్దటంలో ఆసక్తి చూపటంతో పవన్ అనుమతితో చేస్టున్నట్లు తెలుస్తోంది. కొంత ప్యాచ్ వర్క్ ని రచయిత బి.వియస్ రవి తో కలిపి ఫినిష్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇది రూమరా,నిజమా అనేది ప్రక్కన పెడితే, ప్రాజెక్టు బాగా వచ్చి పెద్ద హిట్ కావాలనే పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.

  పూరి జగన్నాధ్ తన తదుపరి చిత్రం ఇద్దరు అమ్మాయిలుతో స్క్రిప్టు హడావిడిలో బ్యాంకాక్ లో ఉన్నారు. నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. 'పవన్‌కళ్యాణ్‌ ఓ పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. మంచి పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో పూరి జగన్నాధ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అభిమానులు అంతా మెచ్చేవిధంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ ఎపిసోడ్స్‌ హైలెైట్‌గా ఉండబోతున్నాయి అన్నారు. అలాగే పూరి జగన్నాధ్‌ ప్రత్యేకంగా పవన్‌ కోసం రాసిన డెైలాగ్స్‌కు థియేటర్లో చప్పట్లు మార్మోగుతాయి. ఏకధాటిగా సింగిల్‌ షెడ్యూల్‌లో ఇంతటి భారీ చిత్రాన్ని పూర్తిచేయడానికి ప్రధాన కారణం పవన్‌కళ్యాణ్‌, పూరిల సహకారం. మా బ్యానర్‌లో పవన్‌కి బిగ్గెస్ట్‌ హిట్‌ రాబోతున్నందుకు సంతోషంగా ఉంది' అన్నారు.

  ఈ చిత్రం బిజినెస్ విషయానికి వస్తే... ముఖ్యంగా ఈ చిత్రం యు.ఎస్ లో ఓ కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని నిర్మాత డివివి దానయ్య స్వయంగా మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..తాను యు.ఎస్ లో ఈ చిత్రాన్ని స్వయంగా రిలీజ్ చేస్తున్నానని, అక్కడ $ 260 k కి పదమూడు సెంటర్లు అమ్ముడుపోయిందని అన్నారు. ఇది యుఎస్ లో ఓ తెలుగు చిత్రానికి వచ్చిన హైయిస్ట్ ప్రైస్ అని ఇప్పటివరకూ ఈ రేంజి బిజినెస్ ఏ చిత్రానికి జరగలేదని అన్నారు.

  పవన్ కళ్యాణ్, తమన్నా, గేబ్రియేల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో-డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి దానయ్య, కథ-స్క్ర్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

  English summary
  
 It is heard that Harish Shankar has reportedly been roped in to do the final PatchWork for the film ‘Cameraman Ganga Tho Rambabu’. According to sources, this was being taken care of by BVS Ravi, another RGV protege but he has done the maximum part and left for Bangkok.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X