మెగా ఫ్యాన్స్‌కు పండుగలాంటి వార్త: రామ్ చరణ్ తర్వాతి సినిమాపై క్లారిటీ వచ్చేసింది.!

By Manoj Kumar P

'చిరుత' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'మగధీర'తో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ సినిమా వల్ల రామ్ చరణ్ పేరు మారుమ్రోగిపోయింది. దీని తర్వాత కూడా అతడి ఖాతాలో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చి చేరాయి. దీంతో చరణ్ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు.

ఈ క్రమంలోనే తన మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకున్నాడు. ప్రస్తుతం అతడు RRR అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా దీని తర్వాత చెర్రీ నటించబోయే సినిమాపై క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ చరణ్ ఏ దర్శకుడి సినిమాలో నటిస్తున్నాడు.? వివరాల్లోకి వెళితే..

మరో స్టార్ హీరోతో కలిసి చేస్తున్నాడు

మరో స్టార్ హీరోతో కలిసి చేస్తున్నాడు

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. దర్శకధీరుడు తెరెక్కిస్తున్న RRRలో నటిస్తున్నాడు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో చరణ్.. అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో మెగా హీరో సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది.

రామ్ చరణ్ డుయల్ రోల్

రామ్ చరణ్ డుయల్ రోల్

రామ్ చరణ్ ఈ ఏడాది ‘వినయ విధేయ రామ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అలాగే, ‘సైరా: నరసింహారెడ్డి' ద్వారా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ చరణ్.. చిరంజీవితో మరో సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దీన్ని కొరటాల డైరెక్ట్ చేయనున్నాడు.

 చరణ్ సినిమాను ప్రకటించేది అప్పుడే

చరణ్ సినిమాను ప్రకటించేది అప్పుడే

RRR తర్వాత ఈ మెగా హీరో నటిస్తున్న సినిమా ఎవరితో అన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అదే సమయంలో చరణ్ జనవరిలో తన తదుపరి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నాడని ఈ మధ్య ఓ వార్త వైరల్ అయింది. దీంతో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు.

క్రేజీ డైరెక్టర్‌ కాదు.. పవన్ డైరెక్టర్

క్రేజీ డైరెక్టర్‌ కాదు.. పవన్ డైరెక్టర్

రామ్ చరణ్ నటించే సినిమాకు క్రేజీ డైరెక్టర్ ‘అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించబోతున్నాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. తాజాగా చరణ్ తర్వాతి సినిమాను తెరకెక్కించే దర్శకుడి పేరు బయటకు వచ్చింది. గతంలో పవన్ కల్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్' అనే సినిమాను తీసిన హరీశ్ శంకర్‌తో అతడు పని చేయబోతున్నాడని తెలుస్తోంది.

మెగా కాంపౌండ్ డైరెక్టర్

మెగా కాంపౌండ్ డైరెక్టర్

హరీశ్ శంకర్‌కు ‘గబ్బర్ సింగ్' సినిమాతో ఎంతో మంచి పేరు వచ్చింది. ఈయన తర్వాత కూడా సాయి ధరమ్ తేజ్‌తో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్', అల్లు అర్జున్‌తో ‘డీజే', వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్' సినిమాలు తీశాడు. దీంతో హరీశ్‌కు మెగా కాంపౌండ్ డైరెక్టర్ అని పేరు వచ్చింది. ఇప్పుడు చరణ్‌తో సినిమా కూడా పూర్తయితే దాదాపుగా అందరినీ కవర్ చేసినట్లు అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X