పవన్ అభిమానులకు షాకింగ్ న్యూస్: మరో హీరోతో హరీశ్ శంకర్ మూవీ.. PSPK28 ఉంటుందా లేదా అంటే!

సుదీర్ఘమైన విరామం తర్వాత 'వకీల్ సాబ్'తో సినిమాల్లోకి రీఎంట్రీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇది విడుదల కాకముందే మరిన్ని చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నాడు. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా మొదలు పెడుతున్నాడు. ఇప్పటికే ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరో రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. హరీశ్ శంకర్‌తో సినిమా మొదలు పెట్టాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ డైరెక్టర్ పవన్‌తో కాకుండా మరో హీరోతో సినిమా చేస్తున్నాడంటూ.. అభిమానులను షాక్‌కు గురి చేసే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళితే...

నాభి అందాలను ప్రదర్శిస్తున్న శ్రీజా ఘోష్.. వయ్యారాలను ఒలకబోస్తూ షోటోషూట్

 అదిరిపోయిన రీఎంట్రీ.. ఫుల్ జోష్‌లో పవన్

అదిరిపోయిన రీఎంట్రీ.. ఫుల్ జోష్‌లో పవన్

పింక్ మూవీకి రీమేక్‌గా వచ్చిన 'వకీల్ సాబ్'తో పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా విడుదలను ఆయన అభిమానులు పండుగలా జరుపుకున్నారు. దీంతో గ్రాండ్ ఓపెనింగ్స్ కూడా దక్కాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి హిట్ టాక్‌తో పాటు కలెక్షన్లూ మంచిగానే వచ్చాయి. దీంతో పవన్ కల్యాణ్ రెట్టించిన జోష్‌లో ఉన్నాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

 ఆ మూవీ రీమేక్.. వీరమల్లుగా చేస్తున్నాడు

ఆ మూవీ రీమేక్.. వీరమల్లుగా చేస్తున్నాడు

ప్రస్తుతం పవన్ కల్యాణ్.. 'అయ్యప్పనుమ్ కోషియం' అనే మలయాళ సినిమా రీమేక్‌లో దగ్గుబాటి రానాతో కలిసి నటిస్తున్నాడు. సాగర్ కే చంద్ర రూపొందిస్తోన్న ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నాడు. అలాగే, క్రిష్ జాగర్లమూడితో కలిసి 'హరిహర వీరమల్లు' అనే పిరియాడిక్ మూవీని కూడా చేస్తున్నాడు. ఏఎమ్ రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

హరీశ్ శంకర్‌తో... ఇప్పుడే మొదలైంది అని

హరీశ్ శంకర్‌తో... ఇప్పుడే మొదలైంది అని

'వకీల్ సాబ్' మూవీ షూటింగ్ ప్రారంభం అయిన సమయంలోనే పవన్ కల్యాణ్.. హరీశ్ శంకర్‌తో సినిమా చేయబోతున్నాడని ప్రకటన వెలువడింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'గబ్బర్ సింగ్' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఈ చిత్రం రాబోతుండడంతో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. దీనికి 'ఇప్పుడే మొదలైంది' అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది.

సినిమా కథపై పుకార్లు.. అలా ఇలా అంటూ

సినిమా కథపై పుకార్లు.. అలా ఇలా అంటూ

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించబోయే సినిమా విషయంలో ఎన్నో అంశాలు తెరపైకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ చిత్ర కథ విషయంలో కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. ఇది ఠాగూర్ తరహా సినిమా అని.. ఇందులో పవన్ ప్రొఫెసర్‌గా నటిస్తున్నాడని కొందరు అన్నారు. అలాగే, పోలీస్ ఆఫీసర్ కథ అని, పాలిటిక్స్ నేపథ్యంతో కూడిందని మరికొందరు చెప్పారు.

పవన్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. మరో హీరో

పవన్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. మరో హీరో

'వకీల్ సాబ్' సందేశాత్మక చిత్రం.. 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ మూవీ.. 'హరిహర వీరమల్లు' పిరియాడిక్ సినిమా కావడంతో హరీశ్ శంకర్ తెరకెక్కించనున్న కమర్షియల్ ఫిల్మ్ కోసం పవన్ కల్యాణ్ అభిమానులంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన పవర్ స్టార్‌ను కాదని మరో స్టార్ రవితేజతో సినిమా చేస్తున్నాడన్న షాకింగ్ న్యూస్ తాజాగా లీకైంది.

ఆ నిర్మాణ సంస్థ అప్పుడు చేసిన ట్వీట్ ఇదే

ఆ నిర్మాణ సంస్థ అప్పుడు చేసిన ట్వీట్ ఇదే

హరీశ్ శంకర్.. పవన్‌తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ.. త్వరలోనే హరీశ్ శంకర్‌తో సినిమా చేయబోతున్నట్లు కొన్ని నెలల క్రితమే ట్వీట్ చేసింది. ఇప్పుడు రవితేజతో చేసే సినిమా అదే అయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Recommended Video

Pawan Kalyan పై బాబు గోగినేని సెటైర్.. మెగా బ్రదర్ ఫైర్!! || Filmibeat Telugu
 PSPK28 ఉంటుందా లేదా అనుమానాలు

PSPK28 ఉంటుందా లేదా అనుమానాలు

రవితేజతో హరీశ్ శంకర్ గతంలో 'షాక్', 'మిరపకాయ్' వంటి చిత్రాలు చేశాడు. దీని తర్వాత మళ్లీ కలుద్దామనుకున్నా వీలు పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే వీళ్లిద్దరూ కలుసుకున్నారని తెలిసింది. ఈ సమయంలోనే సినిమాను ఓకే చేసుకున్నారని కూడా అంటున్నారు. ఈ సినిమా చేసినప్పటికీ.. పవన్‌తో సినిమా కూడా ఉంటుదని, అది తర్వాత ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X