పుష్ప ఎఫెక్ట్ : దేవరకొండతో హరీష్ శంకర్… రచ్చ రేపే క్రేజీ కధ?

తెలుగులో నువ్విలా సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఎట్టకేలకు పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. చివరిగా చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా నిరాశ పరిచగా ఆయన ఇప్పుడు పూరీ జగన్నాథ్ తో కలిసి లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే తదుపరి సినిమా సుకుమార్ తో ఫైనల్ చేసుకున్న విజయ్ ఇప్పుడు మరో సినిమా ఒప్పుకున్నాడని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

లైగర్ తో బిజీ

లైగర్ తో బిజీ

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నా అనూహ్యంగా ఈ సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పాలి. కధగా బానే ఉన్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం సినిమా నిరాశ పరిచింది అనే చెప్పాలి. అలా ఆ సినిమా పూర్తయిన వెంటనే ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా మొదలు పెట్టాడు.

అదేం లేదు

అదేం లేదు

ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుని మంచి లైన్ లో పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ బాక్సింగ్ నేపథ్యం ఉన్న సినిమా తెరకెక్కిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాని ఈ సినిమాకు ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భారీగా ఆఫర్ చేసినట్లు ప్రచారం జరగగా దానిని విజయ్ దేవరకొండ ఖండించారు.

 సుకుమార్ తో సినిమా

సుకుమార్ తో సినిమా

ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన సుకుమార్ డైరెక్షన్లో ఒక సినిమా చేయాల్సి ఉంది. అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్న సుకుమార్ అది పూర్తి చేసిన తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి పని చేయవలసి ఉంది. పుష్పని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని సుకుమార్ నిర్ణయించుకోవడంతో ఇప్పుడు ఈ విషయంలో అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.

 2022 దాకా బిజీ

2022 దాకా బిజీ

ఈ రెండు భాగాల నేపథ్యంలో సుకుమార్ 2022 చివరి వరకు పుష్పతోనే బిజీగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో త్వరలో లైగర్ పూర్తి చేయబోతున్న విజయ్ దేవరకొండ మరో సినిమా ఒప్పుకోవడానికి సిద్దంగా ఉన్నాడని అంటున్నారు. లైగర్ తర్వాత ఎక్కువ సమయం వృధా చేయకుండా ఉండటానికి వేరే దర్శకుడితో ఒక ప్రాజెక్టును ఓకే చేయడానికి రెడీగా ఉన్నాడని అంటున్నారు.

క్రేజీ కాంబో

క్రేజీ కాంబో

అందుతున్న సమాచారం మేరకు త్వరలో పవన్ కళ్యాణ్ యొక్క పిఎస్పికె 28 సినిమాని తెరకెక్కించాల్సిన హరీష్ శంకర్ తన తదుపరి సినిమా కోసం విజయ్ దేవరకొండతో కలిసి పని చేయబోతున్నారని అంటున్నారు. దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు. హరీష్ శంకర్ వివరించిన స్క్రిప్ట్ విజయ్ దేవరకొండకు నచ్చితే, ఈ ప్రాజెక్ట్ లాక్ అవుతుందని, త్వరలో ఆ సినిమా అధికారికంగా ప్రకటించబడుతుందని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X