Usthad Bhagath Singh ‘ఉస్తాద్’‌కు షాకిచ్చిన హరీష్ శంకర్.. పవన్ కల్యాణ్ మూవీ వదిలేసి..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా అంటే.. అభిమానులకు పిచ్చి క్రేజ్ ఉంటుంది. గబ్బర్ సింగ్ తర్వాత వారిద్దరూ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయడానికి సిద్దమవ్వడంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ తర్వాత రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో అంచనాలు రెండింతలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు నిరాశను కలిగించే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వార్త వివరాల్లోకి వెళితే..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే.. షూటింగ్ విడుతల వారీగా జరుగుతున్నది. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమా షూటింగులకు సమయాన్ని కేటాయించ లేకపోతున్నారు. దాంతో దాదాపు అన్ని సినిమాలు ఆలస్యంగా ముందుకెళ్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ మరింత ఆలస్యం కావడం తథ్యంగా కనిపిస్తున్నది.

 Harish Shankar To start the new project keeping beside Pawan Kalyans Usthad Bhagath Singh

తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30వ తేదీన జరగనుండటంతో పవన్ కల్యాణ్ బిజీగా ఉండబోతున్నారు. నవంబర్ నెల మొత్తం ఎలాంటి షూటింగులకు హాజరు కావడం లేదని చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు. నవంబర్ నెల మొత్తం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆ తర్వాతే సినిమాల గురించి ఆలోచిస్తారని తెలిసింది.

తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్ర ప్రదేశ్‌లో ఎలక్షన్లు వస్తున్నాయి. డిసెంబర్, జనవరి నెలల్లో ఎన్నికలపై ఓ అవగాహన రానున్నది. ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే.. సినిమాలకు పవన్ కల్యాణ్ మరింత దూరం అయ్యే అవకాశం ఉంది. దాంతో ఏపీ ఎలక్షన్ల తర్వాతే సినిమాలపై దృష్టిపెట్టే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తున్నది.

ఇలాంటి పరిస్థితుల మధ్య ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో సంచలన నిర్ణయం తీసుకొన్నారు. పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ జరిగే అవకాశం లేకపోవడంతో మరో సినిమాపై దృష్టిపెట్టాలని నిర్ణయించుకొన్నారనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతున్నది. మరో 6, 7 నెలలు సినిమా పూర్తి చేసే అవకాశం లేకపోవడంతో మరో సినిమాను ప్రారంభించాలనే ఆలోచనలో హరీష్ శంకర్ ఉన్నారనే తెలుస్తుంది.

ఏపీలో ఎన్నికల ప్రచారం, పోటీ నేపథ్యంలో పవన్ కల్యాణ్ అందుబాటులో ఉండరనే విషయంతో మరో సినిమాను ప్రారంభించేందుకు హరీష్ శంకర్ సిద్దమవుతున్నారు. త్వరలోనే ఓ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X