తమన్‌ తీరుపై హరీష్ శంకర్ చురకలు?

By Bojja Kumar

హైదరాబాద్ : మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తీరుపై దర్శకుడు హరీష్ శంకర్ గుర్రుగా ఉన్నాడా? హరీష్ శంకర్ తన ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా తమన్‌కు చురకలు అంటించడానికేనా? అంటే అవునే అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. హరీష్ శంకర్ అలా వ్యాఖ్యానించడానికి ఓ ప్రత్యేకమైన కారణం కూడా ఉందట.

పరిశ్రమలో కొందరు టెక్నీషియన్స్ 'క్రియేటివ్ వర్క్ సార్' అంటూ పని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ హరీష్ శంకర్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం ఆడియో వర్క్ ఆగస్టు 2వ వారంలోగా పూర్తి చేస్తామని చెప్పి అనుకున్న సమయానికి పూర్తి చేయలేదట. మరో రెండు సాంగులు పెండింగులో పెట్టాడట. దీంతో అనుకున్న సయమానికి ఆడియో రిలీజ్ చేయలేక పోతున్నారు దర్శక నిర్మాతలు. దీంతో ఆడియో ఆగస్టు 3వ వారానికి వాయిదా పడింది.

తమన్ వ్యవహారంపై అసంతృప్తిగా ఉన్న హరీష్ శంకర్ కావాలనే ట్విట్టర్ ద్వారా ఈ వ్యాఖ్యలు చేసాడ అంటున్నారు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 27 విడుదల చేస్తామని దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవల వెల్లడించారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు.

బాద్‌షా తర్వాత ఎన్టీఆర్‌, గబ్బర్‌సింగ్‌ తర్వాత హరీశ్‌ శంకర్‌ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. టైటిల్‌కు అన్ని వర్గాల నుంచీ మంచి స్పందన వచ్చిందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పంచ్‌ డైలాగ్స్‌, ఆయన ఎమోషనల్‌ కేరక్టర్‌ హైలైట్‌గా నిలుస్తాయని హరీశ్‌ శంకర్‌ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X