అకీరా కోసం స్టార్ డైరెక్టర్ కథ.. పవన్ ఫ్యాన్ అనిపించుకున్నాడుగా!
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. దీనికి కారణం మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ కుటుంబం నుంచి చాలా మంది హీరోలుగా పరిచయం అవడంతో పాటు స్టార్లుగా హవాను చూపిస్తుండడమే. ఇప్పటికే ఇలా ఎంతో మంది వెండితెరపై సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తన కుమారుడు అకీరా నందన్‌ను హీరోగా తీసుకు రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా ఓ ఊహించని న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది. ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!
అంత మంది వచ్చేశారుగా
ఎంతో పోటీ ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో వచ్చి టాలీవుడ్‌లో పెద్ద స్టార్‌గా మారిపోయారు. ఆయన తర్వాత ఇదే ఫ్యామిలీ నుంచి నాగబాబు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక ఇలా ఎంతో మంది పరిచయం అయ్యారు. వీరిలో చాలా మంది ఇప్పుడు స్టార్ హీరోలుగా హవాను చూపిస్తున్నారు.

అకీరా కూడా వస్తాడంటూ
మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలుగా వచ్చినా.. పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్‌పై అందరి కళ్లూ ఉన్నాయి. చిన్న వయసులో ఉన్నప్పుడే అతడు సినిమాల్లోకి వస్తాడని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగకపోవడంతో ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఇక, అకీరా టీనేజ్‌లోకి రావడంతో ఇప్పుడు హీరోగా పరిచయం అవుతాడని ఓ రేంజ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
రేణు దేశాయ్ ఖండిచారు
పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుండడంతో రేణు దేశాయ్ దీనిపై పలుమార్లు స్పందించారు. ఈ మేరకు ఆమె పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. 'అకీరాకు ఇప్పుడు పెద్దగా వయసు రాలేదు. వాడికి ప్రస్తుతానికి సినిమాల్లోకి రావాలని లేదు. ఇప్పుడైతే స్టడీస్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు' అని స్పష్టం చేశారు.

మళ్లీ రూమర్... భారీగానే
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్ ఫస్ట్ మూవీపై తరచూ ఎన్నో రకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే అతడి తొలి చిత్రం గురించి మరో క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. అతి త్వరలోనే అకీరా నందన్ ఫస్ట్ మూవీ లాంచ్ కాబోతున్నాడనేది దాని సారాంశం. అంతేకాదు, బడా సంస్థ అతడిని పాన్ ఇండియా రేంజ్‌లో తీసుకొస్తుందని అంటున్నారు.
అకీరా కోసం అదిరే కథ
మెగా లిటిల్ ప్రిన్స్ అకీరా నందన్ తెరంగేట్రం గురించి ప్రచారాలు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. పవన్ కల్యాన్ కుమారుడు అకీరా కోసం స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఓ పవర్‌ఫుల్ స్టోరీని రెడీ చేస్తున్నాడట. ఇది భారీ స్కేల్‌లో రాబోయే పాన్ ఇండియా ప్రాజెక్టు కాబోతుందనే టాక్ కూడా వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications