»   » డైరెక్టర్‌తో బ్రేకప్.. అసిస్టెంట్ డైరెక్టర్‌తో ప్రముఖ తార అఫైర్.. ఎవరా హీరోయిన్..

డైరెక్టర్‌తో బ్రేకప్.. అసిస్టెంట్ డైరెక్టర్‌తో ప్రముఖ తార అఫైర్.. ఎవరా హీరోయిన్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా పరిశ్రమలో ఏ హీరోయిన్ అయినా మంచి కెపాసిటీ ఉన్న హీరోయిన్‌తోనే అఫైర్ పెట్టుకోవడం చూస్తూ ఉంటాం. సాదాసీదా వ్యక్తులతో సంబంధం పెట్టుకొని రిస్క్ తీసుకోవడానికి ఏ తార సిద్ధపడదనేది జగమెరిగిన సత్యం. ఇలాంటి వాదనలకు చెక్ పెట్టిన బాలీవుడ్ తార పరిణితి చోప్రా ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌తో అఫైర్ పెట్టుకొన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌తో జోరుగా రిలేషన్‌ పెట్టుకొన్న ప్రియాంక చోప్రా సోదరి పరిణితి ఆ వ్యక్తితో జాలీ ట్రిప్‌కు వెళ్లినట్టు బాలీవుడ్ కోడై కూస్తున్నది.

డైరెక్టర్ గుడ్ బై చెప్పి.. అసిస్టెంట్ డైరెక్టర్‌తో..

డైరెక్టర్ గుడ్ బై చెప్పి.. అసిస్టెంట్ డైరెక్టర్‌తో..

గతంలో లేడీస్ వర్సెస్ రికీ బెహల్, శుద్ధ్ దేశీ రొమాన్స్ చిత్రాల దర్శకుడు మనీష్ శర్మతో రిలేషన్ పెట్టుకొన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఏవో తెలియని కారణాల వల్ల వారి మధ్య బ్రేకప్ జరిగిందనే తాజా సమాచారం. ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్‌తో రొమాన్స్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.

లేట్ నైట్ పార్టీలతో..

లేట్ నైట్ పార్టీలతో..

తాజా ప్రియుడితో పరిణితి రహస్య సమావేశాలు, లేట్ నైట్ పార్టీలతో దుమ్ము రేపుతున్నదట. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన వారిద్దరే చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారట. వీరి వ్యవహారాన్ని బాలీవుడ్‌లో కథలు కథలుగా చెప్పుకొంటున్నారట.

బ్రేకప్ ముగిసిన అధ్యాయం..

బ్రేకప్ ముగిసిన అధ్యాయం..

ఇటీవల ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ నిర్వహించే కాఫీ విత్ కరన్ షోకు పరిణితి హాజరైంది. ఆ సందర్బంగా మనీష్‌తో అఫైర్ గురించి కరణ్ ప్రస్తావించగా అది గడిచిపోయిన విషయమని చెప్పడం గమనార్హం. మనీష్‌తో సంబంధం ముగిసిన అధ్యాయం. బ్రేకప్ జరిగింది. బాధపడ్డాను. ఇక దాని గురించి చెప్పుకోవాల్సింది ఏముంది అని పరిణితి తన గోడును చెప్పుకోవడం తెలిసిందే.

 గాయకురాలిగా పరిణితి

గాయకురాలిగా పరిణితి

ప్రస్తుతం బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి మేరి ప్యారీ బిందు అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రంలో మానా కే హమ్ యార్ నహీ అనే పాటను పాడి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. పరిణితి పాటపై బాలీవుడ్ వర్గాలు ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం.

English summary
Actor Parineeti Chopra has a new boyfriend and even went on a secret vacation with him. Media reports that the actor has found love again, this time in an assistant director. Parineeti and her mystery man are smitten with each other and even went on a hush-hush romantic getaway together.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu