లేటు వయసులో హీరోయిన్ ఘాటు ప్రేమ?
ఒకప్పటి అందాల సుందరి సుష్మితా సేన్ అప్పట్లో చాలా మంది బాలీవుడ్ హీరోలతో ఎఫైర్లు నడిపింది. అయితే ఏ బంధం కూడా పెళ్లి వరకు దారి తీయలేదు. ప్రస్తుతం అమ్మడు వయస్సు 40కి దగ్గర పడింది. పెళ్లి పెటాకులకు స్వస్తి చెప్పి ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకుంటోంది సుస్మితా. ప్రస్తుతం సుస్మితా చేతిలో సినిమాలే ఏమీ లేవు. అడపా దడపా వాణిజ్య ప్రకటనల్లో మాత్రమే దర్శనం ఇస్తోంది.
తాజా అమ్మడు ఇంతియా ఖాత్రి అనే బిజినెస్ మ్యాన్ తో ప్రేమలో పడ్డట్లు బాలీవుడ్ గాసిప్స్ బాలీవుడ్ లో గుప్పుమన్నాయి. ఇంతియాజ్ ప్రముఖ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ గ్రూపుకు హెడ్. ఇటీవల ఓ ఫ్యాషన్ వీక్ లో కలిసి ర్యాంప్ వాక్ చేసిన సుస్మిత-ఇంతియాజ్ తరచూ పలు హాట్ స్పాట్ లలో రహస్యంగా సంచరిస్తున్న సంగతి మీడియా కంట పడింది. దీన్ని ఇద్దరి మధ్య 'సం'బంధం కొనసాగుతందనే వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











