twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోకంటే ఎక్కువ: జయసుధకు అంత డబ్బు ఎందుకు ఇచ్చినట్లు?

    తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి దాదాపు హీరోలకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఉంటుంది. అయితే తాజాగా ఓ సినిమాకు సంబంధించిన నటి జయసుధ హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకోవడం చర్చనీయాంశం అయింది. తల్లి, అత్త పాత్రలు చేసే

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి దాదాపు హీరోలకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఉంటుంది. అయితే తాజాగా ఓ సినిమాకు సంబంధించిన నటి జయసుధ హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకోవడం చర్చనీయాంశం అయింది. తల్లి, అత్త పాత్రలు చేసే జయసుధ ఈ సినిమాకు సాధారణంగా తీసుకునే రెమ్యూనరేషన్ కంటే రెంట్టింపు ఎక్కువ తీసుకున్నారట.

    ఆ సినిమా మరేదో కాదు...'హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య'. విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి ప్రధాన పాత్రలో ఈచిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జయసుధ ఆర్. నారాయణమూర్తి భార్యగా నటిస్తోంది.

    వాస్తవానికి ఈ సినిమా ఒప్పుకోవడానికి జయసుధ ముందు పెద్దగా ఆసక్తి చూపలేదట. అయితే ఆమె సినిమాలో ఉండటం చాలా కీలకం కావడంతో రూ. 75 లక్షల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి ఒప్పించారట. ఆమె సాధారణంగా తీసుకునే రెమ్యూనరేషన్ కంటే ఇది రెట్టింపు.

     హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య

    హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య

    శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై పీపుల్స్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం`హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌`. చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

     స‌మాజంలో ప్ర‌ధాన స‌మ‌స్య ఆధారంగా

    స‌మాజంలో ప్ర‌ధాన స‌మ‌స్య ఆధారంగా

    ద‌ర్శ‌కుడు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ - ``నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ‌గారితో చేసిన హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య ప్ర‌స్తుతం స‌మాజంలో ప్ర‌ధాన స‌మ‌స్య ఆధారంగా రూపొందింది. అదేంట‌నేది సినిమా చూడాల్సిందే. ఓ నిజాయితీ గ‌ల హెడ్ కానిస్టేబుల్ త‌న నిజాయితీతో ఉండ‌టం వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాడు. దాన్ని ఎలా అధిగ‌మ‌నించాడ‌నేదే క‌థ‌ అని తెలిపారు.

    ప్ర‌ధాన స‌మ‌స్య ఆధారంగా

    ద‌ర్శ‌కుడు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ - ``నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ‌గారితో చేసిన హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య ప్ర‌స్తుతం స‌మాజంలో ప్ర‌ధాన స‌మ‌స్య ఆధారంగా రూపొందింది. అదేంట‌నేది సినిమా చూడాల్సిందే. ఓ నిజాయితీ గ‌ల హెడ్ కానిస్టేబుల్ త‌న నిజాయితీతో ఉండ‌టం వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాడు. దాన్ని ఎలా అధిగ‌మ‌నించాడ‌నేదే క‌థ‌ అని తెలిపారు.

     నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ

    నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ

    నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ క‌లిసి తెర‌పై క‌న‌ప‌డ‌బోతున్నార‌ని తెలియ‌గానే ప్రేక్ష‌కుల్లో ఓ ఆస‌క్తి ఏర్ప‌డింది. జ‌య‌సుధ‌గారు, నారాయ‌ణ‌మూర్తిగారు ఇద్ద‌రూ చాలా గొప్ప‌గా న‌టించారు. వీరితో పాటు మిగిలిన అంద‌రూ న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ స‌పోర్ట్‌తో అనుకున్న విధంగా సినిమా షూటింగ్ అంతా పూర్త‌య్యింది. జ‌న‌వ‌రి మొద‌టి వారంలో సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి, పాట‌ల‌ను కూడా జ‌న‌వ‌రి మొద‌టివారంలోనే విడుద‌ల చేస్తాం. అలాగే సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నామని చదలవాడ శ్రీనివాసరావు తెలిపారు.

     నటీనటులు

    నటీనటులు

    ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ‌, సునీల్ శ‌ర్మ‌, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, త‌నికెళ్ల భ‌ర‌ణి, చ‌ల‌ప‌తిరావు, వెన్నెల కిశోర్‌, వై.విజ‌య‌, స‌మీర్‌, విజ‌య భాస్క‌ర్‌, విజ‌య్‌, పార్వ‌తి త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

     టెక్నీషియన్స్

    టెక్నీషియన్స్

    ఈ సినిమాకు సంగీతం: వందేమాత‌రం శ్రీనివాస్‌, డైర‌క్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌ఫీ: కె.సుధాక‌ర్ రెడ్డి, ఎడిట‌ర్‌: మోహ‌న రామారావు, నృత్యాలు: శివ‌సుబ్ర‌హ్మ‌ణ్యం, ఫైట్స్: స‌తీష్ మాస్ట‌ర్‌, స‌మ‌ర్ప‌ణ‌: చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు, నిర్మాత‌: చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు.

    English summary
    Sources said that, "Head Constable Venkatramaiah" makers offered Rs 75 lakhs to Jayasudha, which is more than double the price she normally gets. Her remuneration is also higher than the movie's hero R Narayanamurthy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X