Don't Miss!
- News
రంగంలోకి ప్రధాని మోదీ - షా : తెలంగాణలో త్రిముఖ వ్యూహం..!!
- Finance
fpi: ఇండియన్ మార్కెట్ల నుంచి FPIల నిష్క్రమణ.. ఒక్క నెలలోనే అన్ని కోట్లా ??
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
హద్దులుదాటి అందాల వడ్డన.. ఆ యువ హీరోతో హెబ్బా రొమాన్స్.. ఇది గనక బయటికి రావాలే గానీ!
ఈ తరం హీరోయిన్స్‌కి అందాల ఆరబోత అనేది ప్రధాన అస్త్రంగా మారింది. సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు గాను ఇలాంటి ప్రయత్నాలే ఎక్కువగా చేస్తుండటం గమనించవచ్చు. వెండితెర, ఆన్‌లైన్ తెరలపై అందాల ఆరబోత తోనే అట్రాక్ట్ చేస్తున్నారు అందాల తారలు. తాజాగా అదే బాటలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ మరో అడుగు ముందుకేసి అందాలు వడ్డించిందట. ఆ వివరాలేంటో చూద్దామా..

కుమారి 21 ఎఫ్ బ్యూటీ..
పాతికేళ్ల యంగ్ లేడీ హెబ్బా పటేల్ బోల్డ్‌గా నటించడంలో ఎంత దిట్టనో.. బోల్డ్‌గా ఫొటోలు దిగి వాటిని తన సోషల్ మీడియాలో ఉంచుతూ ఆకర్షించడంలోనూ అంతే దిట్ట. పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన ఈ భామకు తెలుగులో 'కుమారి 21 ఎఫ్' మంచి బ్రేక్ ఇచ్చింది.

రెచ్చిపోయిన హెబ్బాపటేల్.. ముద్దులే ముద్దులు
ఇటీవలే 24 కిస్సెస్ మూవీలో కూడా రెచ్చిపోయి పర్‌ఫార్మ్ చేసింది హెబ్బాపటేల్. బోల్డ్ సీన్స్‌లో తనదైన హావభావాలతో ఆకట్టుకుంది. కానీ లాభం లేదు. హెబ్బా హాట్ ట్రీట్ ఏ మాత్రం పనిచేయలేదు. ఎప్పటిలాగే అవకాశాల కొదవ ఏర్పడింది. చివరకు స్టన్నింగ్ లుక్ లోకి మారి RED మూవీలో ఐటమ్ సాంగ్ చేసింది ఈ బ్యూటీ.

ఎనర్జిటిక్ స్టార్ రామ్.. సెట్స్‌పై RED
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా RED. కొంతకాలంగా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. విభిన్న తరహా కథనంతో క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఈ మూవీ కథ సిద్ధం చేసుకొని కెమెరా ముందు పెట్టారు డైరెక్టర్ కిషోర్ తిరుమల.

రామ్‌తో రెచ్చిపోయిన హెబ్బా.. ఇన్‌సైడ్ టాక్
ఈ సినిమాలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్‌తో ఐటమ్ సాంగ్ చేయించారు. ఇటీవలే ఈ సాంగ్ చిత్రీకరణ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తిచేశారు. ఈ పాటలో రామ్ - హెబ్బా పటేల్ ఎనర్జీ పీక్ స్టేజ్‌లో చూడబోతున్నామని తెలుస్తోంది. ఈ ఒక్క పాటతో హెబ్బా కెరీర్ మరో మలుపు తిరగడం ఖాయం అని ఇన్‌సైడ్ టాక్.

అందాల ఆరబోత.. బయటకు రావాలే గానీ!
ఈ ఐటెమ్ సాంగులో అందాలు ఆరబోయడానికి హెబ్బా పటేల్ ఎంతమాత్రం వెనకాడలేదట. హద్దులు దాటేసి వయ్యారాలు ఒలకబోసిందని సమాచారం. ఈ సాంగ్ యూత్‌ను ఒక ఊపు ఊపేస్తోందని అంటున్నారు. ఈ ఐటెమ్ సాంగ్ బయటకు రావాలే గానీ.. ఈ తరహా సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రెస్ హెబ్బా అని చెప్పుకుంటారని అంటున్నారు.
Recommended Video

ఏకంగా ముగ్గురితో రామ్ రొమాన్స్..
ఇకపోతే ఈ RED మూవీలో రామ్ సరసన నివేద పేతురాజ్, మాళవిక శర్మ, అమృత హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.