»   »  రాజ్ తరుణ్‌కు హ్యాండిచ్చి.. మరో కుర్రహీరోతో హెబ్బాపటేల్.. అతిచనువుగా..

రాజ్ తరుణ్‌కు హ్యాండిచ్చి.. మరో కుర్రహీరోతో హెబ్బాపటేల్.. అతిచనువుగా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో బోల్డుగా నటించే హీరోయిన్లలో యువ తార హెబ్బా పటేల్‌కు చాలా బోల్డ్ అనే పేరుంది. అందుకు ఆమె నటించిన కుమారి21ఎఫ్ చిత్రం నిరూపించింది. యువ హీరో రాజ్ తరుణ్‌తో వరుసగా మూడో సినిమా చేసే వరుస హిట్లను సొంతం చేసుకొన్నది. ఈ నేపథ్యంలో హీరో రాజ్ తరుణ్‌తో హెబ్బా పటేల్‌కు అఫైర్ ఉందనే గాసిప్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ రూమర్ అలా వైరల్ అవుతుండగానే రాజ్ తరుణ్‌కు హెబ్బా దూరమై.. మరో కుర్ర హీరోతో స్పెషల్ రిలేషన్ పెంచుకొంటున్నట్టు మరో వార్త వెలుగులోకి వచ్చింది.

రాజ్ తరుణ్‌తో అఫైర్..

రాజ్ తరుణ్‌తో అఫైర్..

ఇటీవల అంధగాడు సినిమా ప్రమోషన్ సందర్భంగా హెబ్బా పటేల్ మీడియాతో మాట్లడుతూ..రాజ్ తరుణ్‌తో అఫైర్ గురించి వచ్చే గాసిప్స్‌ను పట్టించుకోను. అందులో నిజం ఉంటే పట్టించుకోవాలి. వాస్తవం లేకపోతే ఎందుకు బాధపడాలి. నాపై గాసిప్స్ వస్తున్నాయంటే నాకు పాపులారిటీ ఉందని నేను అనుకొంటాను. రాజ్ తరుణ్‌తో వరుసగా ఇది మూడో సినిమా. ఇంకో సినిమా చేస్తే పెళ్లి మేము పెళ్లి చేసుకోవడం ఖాయమని రాస్తారేమో.. మరో సినిమా చేస్తే పిల్లలు పుడతారు అని కూడా రాస్తారు. అలాంటి గాసిప్స్‌ను చూసి నేను, రాజ్ తరుణ్ నవ్వుకుంటాం అని అన్నారు.


రాజ్ తరుణ్‌తో బోర్ కొటింది..

రాజ్ తరుణ్‌తో బోర్ కొటింది..

రాజ్ తరుణ్‌తో వెంటనే మరో చిత్రం చేయను. కొంత గ్యాప్ తర్వాత మంచి కథ, పాత్ర లభిస్తే రాజ్ తరుణ్‌తో నటిస్తాను. ఇప్పటికే మూడు సినిమాలు చేయడం వల్ల రాజ్ తరుణ్ బోర్ కొడుతున్నారు. అందుకే కొంత గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకొన్నాను అని హెబ్బా అన్నారు.


ఎంజెల్ హీరోతో అతి చనువుగా..

ఎంజెల్ హీరోతో అతి చనువుగా..

ఆమె అన్నట్టుగానే ప్రస్తుతం రాజ్ తరుణ్‌తో కాకుండా యువ హీరో నాగ అన్వేష్‌తో ఏంజెల్ అనే సినిమా చేస్తున్నది. ఈ షూటింగ్లో నాగ అన్వేష్‌తో రిలేషన్ స్పెషల్‌గా కనిపిస్తుందని, ఆయనతో అతి చనువుగా వ్యవహరిస్తున్నదని చిత్ర యూనిట్‌లో కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఏంజెల్ చిత్ర షూటింగ్‌లో నాగ అన్వేష్, హెబ్బాల హడావిడి ఓ రేంజ్‌లో ఉంటుందనేది ఆ రూమర్ సారాంశం.


హెబ్బా అంటే రాజ్ తరుణ్ ఇంకా.

హెబ్బా అంటే రాజ్ తరుణ్ ఇంకా.

ఇదిలా ఉండగా, తన కెరీర్‌లో వరుస హిట్లకు ఓ కారణమైన హెబ్బా పటేల్ అంటే రాజ్ తరుణ్ ప్రత్యేకమైన అభిప్రాయం ఉందట. తనతో చనువుగా ఉండటం పలు సందర్భాల్లో కనిపించింది. తాజాగా అంధగాడు సక్సెస్ మీట్‌లో కూడా వారిద్దరి కెమిస్ట్రీ చాలా ఇంట్రస్టింగ్ కనిపించింది. కేక్ కట్ చేసిన సమయంలో వారిద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


రూమరేనా.. నిజంగా..

రూమరేనా.. నిజంగా..

ఈ వార్తల బట్టి చూస్తే రాజ్ తరుణ్‌కు నిజంగానే హెబ్బా దూరం కావాలనుకుంటున్నదా? నాగ అన్వేష్ చనువు ఆ సినిమా వరకేనా? లేక ఈ రూమర్ ఏంజెల్ సినిమా హైప్ కోసం సృష్టించారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఏదిఏమైనా రాజ్ తరుణ్‌, హెబ్బా కాంబినేషన్‌కు సిల్వర్ స్క్రీన్‌పై మంచి క్రేజ్ ఉందని రుజువైన సంగతి తెలిసిందే.English summary
Hebah Patel had very good success rate except Mister. She got another success with Andhhagadu. Her combination with Raj Tharun proved lucky again. There is rumors that Hebah developed a special bond with her latest co-star Naga Anvesh. Hebah never responded to the rumors about her relation with Raj Tarun or budding friendship with Naga Anvesh either.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu