బంపర్ ఛాన్స్ కొట్టేసిన హెబ్బా పటేల్.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్
ముంబై బ్యూటీ హెబ్బా పటేల్ గుర్తుందిగా! పాతికేళ్ల ఈ పాప బోల్డ్‌గా నటించడంలో ఎంత దిట్ట అనేది అందరికీ తెలిసిందే. పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన ఈ భామకు తెలుగులో 'కుమారి 21 ఎఫ్' మంచి బ్రేక్ ఇచ్చింది. అయినప్పటికీ ఆశించిన మేర అవకాశాలు మాత్రం కరువయ్యాయి. దీంతో ఇక ఆమె కెరీర్ ముగిసినట్లే అనుకున్నారంతా. కానీ ఇంతలో ఈమె లేడీ విలన్ గా మారిందనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా 'భీష్మ'. ఈ సినిమాలో నితిన్ సరసన నాయికగా రష్మిక మందన నటిస్తుండగా వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్ ఆశ్చర్యపరుస్తోంది.

స్క్రిప్ట్ ప్రకారం ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర ఒకటుందట. ఈ పాత్ర సినిమాకే ఎంతో కీలకం అని సమాచారం. అయితే ఈ పాత్రలో హెబ్బా పటేల్ అయితే బాగుంటుందని భావించిన చిత్రయూనిట్.. ఆమెను సంప్రదించగా వెంటనే ఓకే చెప్పేసిందట. ఈ క్రేజీ వార్త ఫిల్మ్‌నగర్‌లో వైరల్ అవుతోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకర విషయమేమిటంటే.. ఇప్పటి వరకూ గ్లామర్ పాత్రల్లో నటించిన హెబ్బా నెగెటివ్ షేడ్స్ పాత్రకు సెలెక్ట్ కావడం. ఇదే నిజమైతే విలన్ గా హెబ్బా ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











