twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ ప్రపంచానికి పరిచయమయ్యే కొత్త జేమ్స్ బాండ్ ఇతడేనా?

    |

    యాక్షన్ మూవీస్, స్పై థ్రిల్లర్స్ ఎన్ని వచ్చినా.. జేమ్స్ బాండ్ సినిమాలకు ఉన్న డిమాండే వేరు. గత యాభై ఏళ్లుగా బాండ్ సిరీస్ సినిమాలు ప్రపంచ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 24 సినిమాలు రాగా... పలువురు స్టార్స్ జేమ్స్ బాండ్ పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం 25వ బాండ్ మూవీ డేనియల్ క్రెయిగ్ హీరోగా రూపొందుతోంది.

    బాండ్ సిరీస్‌ చిత్రాల్లో గత నాలుగు సినిమాల్లో డేనియల్ క్రెయిగ్ నటించాడు. ప్రస్తుతం అతడు తన 5వ బాండ్ మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత క్రెయిగ్ ఈ ఫ్రాంచైజీ నుంచి తప్పుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో కొత్త జేమ్స్ బాండ్ హీరోను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    Henry Golding as James Bond after Daniel Craig?

    'క్రేజీ రిచ్ ఏషియన్' మూవీ స్టార్ హెన్రీ గోల్డింగ్ నెక్ట్స్ జేమ్స్ బాండ్ హీరోగా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై హెన్రీ గోల్డింగ్ సైలెన్స్ మెయింటేన్ చేస్తున్నాడు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

    నెక్ట్స్ జేమ్స్ బాండ్ మూవీ ఏప్రిల్ 8, 2020న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు డానీ బోయెల్ తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలు జోజి ఫుకునాగ చేపట్టారు. డేనియల్ క్రెయిగ్‌కు ఇదే చివరి బాండ్ మూవీ.

    English summary
    Crazy Rich Asians star Henry Golding has maintained silence amid speculations that he is replacing actor Daniel Craig as James Bond in Bond 26.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X