Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినీ ప్రపంచానికి పరిచయమయ్యే కొత్త జేమ్స్ బాండ్ ఇతడేనా?
యాక్షన్ మూవీస్, స్పై థ్రిల్లర్స్ ఎన్ని వచ్చినా.. జేమ్స్ బాండ్ సినిమాలకు ఉన్న డిమాండే వేరు. గత యాభై ఏళ్లుగా బాండ్ సిరీస్ సినిమాలు ప్రపంచ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 24 సినిమాలు రాగా... పలువురు స్టార్స్ జేమ్స్ బాండ్ పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం 25వ బాండ్ మూవీ డేనియల్ క్రెయిగ్ హీరోగా రూపొందుతోంది.
బాండ్ సిరీస్ చిత్రాల్లో గత నాలుగు సినిమాల్లో డేనియల్ క్రెయిగ్ నటించాడు. ప్రస్తుతం అతడు తన 5వ బాండ్ మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత క్రెయిగ్ ఈ ఫ్రాంచైజీ నుంచి తప్పుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో కొత్త జేమ్స్ బాండ్ హీరోను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
'క్రేజీ రిచ్ ఏషియన్' మూవీ స్టార్ హెన్రీ గోల్డింగ్ నెక్ట్స్ జేమ్స్ బాండ్ హీరోగా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై హెన్రీ గోల్డింగ్ సైలెన్స్ మెయింటేన్ చేస్తున్నాడు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
నెక్ట్స్ జేమ్స్ బాండ్ మూవీ ఏప్రిల్ 8, 2020న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు డానీ బోయెల్ తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలు జోజి ఫుకునాగ చేపట్టారు. డేనియల్ క్రెయిగ్‌కు ఇదే చివరి బాండ్ మూవీ.